VB-G RAM G: 15 రోజుల్లో కొత్త జాబ్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన వారికి అవకాశం
TG VB-G RAM G New Job Cards 15 Days Telangana : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. VB-G RAM G (ఉపాధి హామీ) పథకం కింద కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా జాబ్ కార్డు జారీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

VB-G RAM G పథకం కింద జాబ్ కార్డు పొందేందుకు 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఉపాధి హామీ పథకం ద్వారా పని పొందాలనుకునే వారు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి : జాబ్ కార్డు కోసం ముందుగా అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, ఫొటోను జత చేయాలి. పూర్తిచేసిన దరఖాస్తును సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీకి అందజేయాలి.
15 రోజుల్లో జాబ్ కార్డు : దరఖాస్తు అందిన తర్వాత పంచాయతీ స్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. అనంతరం దరఖాస్తును మండల కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ MPDO స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత అర్హత ఉన్న వారికి జాబ్ కార్డు జారీ చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తు చేసిన 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అర్హులు గమనించాల్సిన విషయం : ఉపాధి హామీ పథకం కింద పని పొందాలనుకునే 18 ఏళ్లు నిండిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్, ఫొటో వంటి అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకుని పంచాయతీ సెక్రటరీని సంప్రదించడం మంచిది.


