Railway Jobs : కొత్త గా 560 పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్
RRB Recruitment to various posts of Paramedical Categories 2026 Railway Jobs : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లో కేంద్రీకృత ఉపాధి ప్రకటన (CEN) నెం. 05/2026 ద్వారా పారామెడికల్ విభాగాలలోని వివిధ పోస్టుల భర్తీ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్స్ లో 560 పేరా మెడికల్ పోస్టులు కోసం RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు (నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆరోగ్య మరియు మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II, ఫార్మసిస్ట్ (ప్రారంభ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్) కేటగిరి వారిగా పోస్టులు భర్తీ చేస్తారు. అర్హత వివరాలు త్వరలో పూర్తిగా ప్రకటించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కు ఈనెల 15 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయితే ₹21,700/- to ₹44,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in/) అప్లై చేసుకోవాలి.
10వ తరగతి పాస్ సర్టిఫికేట్లో ఉన్న పూర్తి పేరు మరియు పుట్టిన తేదీతో ఆధార్‌లోని పేరు మరియు పుట్టిన తేదీ 100% సరిపోలేలా అప్డేట్ చేయాలి. నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులు, అర్హతా ప్రమాణాలు, విధానాలు మరియు ఇతర అవసరాలు, అన్ని RRBల ఉమ్మడి వెబ్సైట్లైన https://www.rrbapply.gov.in లో ప్రత్యేకంగా ప్రచురించబడే వివరణాత్మక CEN నెం.05/2026 (ఎప్పటికప్పుడు జారీ చేయబడే ఏవైనా సవరణలతో సహా) ప్రకారం ఖచ్చితంగా ఉంటాయని కూడా స్పష్టం చేయబడింది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

