కొత్త గా అంగన్వాడీలో టీచర్ ఉద్యోగ భర్తీ..ఇంటర్ వాళ్ళకి అవకాశం | TG WDCW Registration Begins For Filling Anganwadi Teacher Posts
TG WDCW opened registration for 120 Anganwadi Teacher vacancies: నిరుద్యోగులకు భారీ శుభవార్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ శాఖ లో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్లు, స్కావెంజర్లు, వంటవారు, ధోబీలు మరియు బార్బర్ల పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ పద్ధతి లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది.
జిల్లాలోని 7 ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జి. శాంతి శ్రీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమనగల్-31, చేవెళ్ల-29, హయత్నగర్-3, ఇబ్రహీంపట్నం-21, మహేశ్వరం- 10, శేరిలింగంపల్లి-5, షాద్నగర్- 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణ: 31-08-2026 నుంచి 10-09-2026 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, అర్హతలు మరియు ఖాళీల వివరాల కోసం http://wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించాలని జిల్లా సంక్షేమ అధికారి గారు సూచించారు.

ప్రాజెక్ట్ పేరు – అంగన్వాడీ టీచర్ పోస్టుల ఖాళీలు
1. ఆమనగల్ : 31
2. చేవెళ్ల : 29
3. హయత్ నగర్ : 3
4. ఇబ్రహీంపట్నం : 21
5. మహేశ్వరం : 10
6. శేరిలింగంపల్లి : 5
7. షాద్ నగర్ : 26
మొత్తం : 125
విద్యార్హత మరియు వయస్సు:
1. అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
2. అభ్యర్థుల కనీస వయస్సు 18 సం.లు నుండి 35సం.లు లోపు ఉండాలి (తేదీ: 01.07.2026 వరకు 18 సం.లు నిండి ఉండాలి).
ఎంపికకు వెయిటేజ్
మున్సిపాలిటీ పరిది లో అప్లై చేసుకునేవారు అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.
ఎంపిక కోసం వెయిటేజీని ప్రభుత్వం ఈ క్రింది విధంగా తెలియజేసింది
1. ఇంటర్మీడియట్/ 12వ తరగతి పరీక్షలో పొందిన మార్కులు : 70 మార్కులు
2. వితంతువు : 05 మార్కులు
3. అనాథ (జెజె చట్టం, 2015 ప్రకారం) : 10 మార్కులు
4. వికలాంగులు (RPWD చట్టం, 2016 ప్రకారం) : 05 మార్కులు
5. సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ : 10 మార్కులు ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:- దరఖాస్తుతో పాటు తగు దృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయిండాలి. తేది: 10.09.2026 సాయంత్రం 5.00 గం.ల లోపు పైన తెలిపిన http://wdcw.tg.nic.in ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు పరచడానికి గాని, మార్పులు చేయడానికి గాని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, రంగారెడ్డి జిల్లా గారికి పూర్తి అధికారము కలదు.
ఆన్లైన్ అప్లోడ్ చేయవలసిన ధ్రువీకరణ పత్రాలు (స్కాన్ చేసిన కాపీలు):
1. పుట్టిన తేదీ / వయస్సు దృవీకరణ పత్రం.
2. కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం (ఇంటర్మీడియట్ / 12వ తరగతి మార్కుల జాబితా)
4. నివాసస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. స్పోర్ట్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే).
9. Ex. సర్వీస్ మ్యాన్ (వర్తిస్తే)
10. EWS సర్టిఫికేట్ (వర్తిస్తి)
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు: 31-08-2026
•ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 10-09-2026 సాయంత్రం 5:00 గంటల వరకు

🛑Notification Click Here
🛑 Vacancy Detail Click Here
🛑Application Form Click Here

