Dwakra Women : డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. సర్వీస్ ఛార్జీలు మాఫీ.. వడ్డీ రేటు తగ్గింపు
Dwakra Women Bank loans Service charges waived.. interest rate reduction : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త. గ్రామీణ బ్యాంకులలో తీసుకున్న రుణాలపై జూలై 1 నుంచి సర్వీస్ చార్జెస్ మరియు వడ్డీరేట్లు భారీగా తగ్గించారు.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే..

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళల రుణాలపై సేవా చార్జీలు పూర్తిగా మాఫీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ గ్రామ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నారు 30 లక్షల మందికి ఊరట ఏడాదికి 500 కోట్ల మేరకు లబ్ధి. జూలై ఒకటి నుంచి తీసుకున్న రుణాలు పై ప్రాసెసింగ్ ఫీజు, లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, ఇన్స్పెక్షన్ ఫీజుతోపాటు డాక్యుమెంటేషన్, ప్రింటింగ్ ఛార్జీలు, పాస్బుక్ అప్ డేషన్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీల వసూలును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీరేట్లు 13% నుంచి 12% తగ్గిస్తుంది. దీంతో మహిళల అభ్యర్థులకు భారీ ఉరట లభించింది. దీనివల్ల 1500 లబ్ధి చేరుతుంది. ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు వేధింపుల నుంచి SBI, యూనియన్ బ్యాంకు నిలిపేయడంతో తాజాగా జాబితాలో ఆంధ్ర గ్రామీణ బ్యాంకు కూడా చేరడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పట్టణ పరిధిలో ఉన్న దాదాపుగా 11 లక్షల సంఘాలు ఉన్నాయి. వీటికి 1.10 కోట్ల మందికి డోక్రా మహిళలకు సభ్యులు ఉన్నారు. ఆంధ్ర గ్రామీణ బ్యాంకుల పరిధిలో 3 లక్షల సంఘాలు ఉన్నాయి వీటిలో 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇవన్నీ రద్దు కారణంగా ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలో సభ్యుల దాదాపుగా ఏడాదికి 500 కోట్లు మెరుపు లబ్ధి చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపారు. రుణాలపై జులై 1 నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేయడం వల్ల ఒక్కొక్క స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి ₹25,000 వరకు ఆదావుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


