12th అర్హతతో రాత పరీక్ష లేకుండా అంగన్వాడిలో టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Telangana Karimnagar district Anganwadi Teacher Notification 2026
Telangana Karimnagar district Anganwadi Teacher vacancy 2026 : కరీంనగర్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ లు, గంగాధర, హుజురాబాద్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్ పరిధిలోని అంగన్ వాడీ టీచర్ ఖాళీలు భర్తీ చేయుటకు అర్హులైన మహిళ అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది.

ముఖ్యమైన తేదీలు
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 01/08/2026
•దరఖాస్తు చివరి తేది: 15/08/2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోగలరు.
•ఖాళీలు, విద్యార్హతలు మరియు ఇతర వివరములకు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ లో పొందగలరు.
ఖాళీల వివరాలు:-
1.గంగాధర : 20
2. హుజురాబాద్ : 16
3. కరీంనగర్ (రూరల్) : 16
4. కరీంనగర్ (అర్బన్) : 8 మొత్తం 60 అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. విద్యార్హత: అభ్యర్థినిలు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను.
2. వయస్సు: 01/07/2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండవలెను.
3.స్థానికత: అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేంద్ర పరిధి వార్డ్/ డివిజన్ (అర్బన్ పరిధిలో), గ్రామపంచాయతీ ( రూరల్ ఏరియాలో) చెందిన స్థానికురాలయి ఉండాలి.
4.ఎస్సీ / ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ/ ఎస్టి వర్గానికి కేటాయించిన అంగన్వాడి టీచర్ పోస్ట్ లకు అదే గ్రామ పంచాయతీలోని ఆవాసాల / గ్రామాలకు చెందిన అభ్యర్థినీలు మాత్రమే అర్హులు
5. https://wdcw.tg.nic.in/ అను వెబ్ సైట్ నందు మాత్రమే అప్లై చేయవలెను.
6. సి.డి.పి.ఓ/DWO/ప్రజావాణి / పోస్ట్/ ఈ మెయిల్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు.
అభ్యర్థినిలు ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది.
1. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు
2.ప్రత్యేక కేటగిరీలు: నితంతువు 5 మార్కులు, అనాదలు- 10 మార్కులు, దివ్యాంగులు – 5 మార్కులు
3. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ- 10 మార్కులు
ఈ నోటిఫికేషన్ రద్దుపరుచుటకు గానీ, మార్పులు చేయుటకు గానీ జిల్లా కలెక్టర్/ చైర్మన్, కరీంనగర్ గారికి పూర్తి అధికారము కలదు. పైన విషయమును అనుసరించి, శ్రీయుత జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లా గారు మహిళలు, పిల్లలు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖలోని ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు, గంగాధర (20), హుజురాబాద్ (16), కరీంనగర్ రూరల్ (16) మరియు ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు కరీంనగర్ అర్బన్ (08) ఖాళీగా ఉన్న అంగన్ టిచర్ల నియామకము కొరకు సంబందించి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడము జరిగినది.
కావున ఇట్టి విషయమై, శ్రీయుత కమీషనర్, పారసంబందాల శాఖ అధికారి, హైదరాబాద్ గారిని కోరునది ఏమనగా పేపర్ నోటిఫికేషన్ ను లీడింగ్ న్యూస్ పేపర్ లో ఇవ్వగలరని కొరడమైనది. Size: Mminimum X Mminimum (సంబందించిన పేపర్ నోటిఫికేషన్ జతచేయదమైనది). తదనంతరం బిల్లు సమర్పించినచో చెక్ ద్వారా అమౌంట్ చెల్లించబడును
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 01/08/2026
•దరఖాస్తు చివరి తేది: 15/08/2026 సాయంత్రము 5.00 గంటల వరకు
వెబ్ సైట్: https://mis.tgwdcw.in/

🛑Notification Pdf Click Here
🛑Vacancy Details Click Here
🛑Apply Online Link Click Here

