రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈనెల 31 వరకే అవకాశం, రెండు, మూడు రోజుల్లోనే స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ | New Smart Ration Card 2026
New Smart QR Code Ration Cards 2026 Latest News: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరా శాఖ కొత్త రేషన్ కార్డు పంపిణీకి కస్తరస్తు చేస్తుంది. ఆగస్టు నెల నుంచి మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకునే అవకాశం రావడంతో నాలుగు ఐదు రోజుల ముందుగానే స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ తో రూపొందించిన కొత్త రేషన్ కార్డు ముద్ర పూర్తి అయినట్లు తెలుస్తుంది. జిల్లాలలో చేరిన కొత్త రేషన్ కార్డులు, కార్డుల పంపిణీ తేదీలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరారు చేసిన వెంటనే పంపిణీ చేస్తారని పౌరసరఫరా శాఖ అధికారులు తెలిపారు. ఉచితంగా ఈకేవిసి పూర్తి చేయడానికి ఈనెల 31 వరకి ఆఖరి తేదీగా పౌర సరఫరా శాఖ అతిథిలక సమాచారం తెలుపుతుంది. ఈ కెవిసి పూర్తి లేని లబ్ధిదారులకు భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకుని స్థానిక డీలర్ వద్ద లేదా మీ సేవ కేంద్రంలో ఈ కేవిసి పూర్తి చేయాలని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు & ఎమ్మెల్సీలు చేతుల మీదగానే లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు అందచేసేలా పౌరసర ప్రాసెసింగ్ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ & డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఇందులో యజమాని ఫోటో మరియు పేరు & చిరునమా ఉంటాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఫోటో కూడా కార్డుపై ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కొత్త రేషన్ కార్డు అలా స్మార్ట్ కార్డు రూపంలో అందిస్తున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డు పై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది.ఈ కోడ్ స్కాన్ చేసిన, రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇటీవల వరకు బియ్యం, చక్కెర & గోధుమలు వంటి రేషన్ వస్తువుల తీసుకున్న పూర్తి వివరాలు తెలుస్తాయి. తెలంగాణ పౌరసరపర శాఖకు అందించే కొత్త రేషన్ కార్డు పైన క్యూఆర్ కోడ్ ఉండడంతో నకిలీ కార్డులు జారీ పూర్తిగా అడ్డు కూడా పడుతుంది. ప్రస్తుతం రేషన్ కార్డు దుకాణ వివరాలు తప్పు నమోదు కావడంతో కొంతమందికి లబ్ధిదారులకు రేషన్ సరుకురా పంపిణీ అవకతవకలు జరిగాయి. స్మార్ట్ కార్డుతో అలాంటి పరిస్థితి ఉండదని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబమునకు ఒకే కార్డు ఉండడంతో తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు.

కొత్తగా రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఆధారంగా ధ్రువీకరణ సులువు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైన తెలిపారు. కుటుంబ వివరాలు ధ్రువీకరణ ప్రభుత్వ సేవ వినియోగం లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం రూపొందించింది. ఈ ఒక కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలను పొందవచ్చు. డీలర్కు కార్డు ఇస్తే తమ వద్ద ఉన్న ఈ-పాస్ యంత్రం ద్వారా QR కోడ్ స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారులు వివరాలతో పాటు ఇప్పటికి తీసుకున్న రేషన్ సరుకు వివరాలు కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శక మరింత పెరిగింది. త్వరలో స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

