AP Deepam 2 Scheme : దీపం 2 పథకంపై మహిళలకు గుడ్ న్యూస్.. సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా నగదు జమ
Andhra Pradesh Deepam 2 Scheme Subsidy Update : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చేపట్టిన దీపం 2 పథకం విషయంలో క్యాబినెట్ లో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచిత LPG అందిస్తున్న నేపథ్యంలో సరికొత్త మార్పులు చేశారు.

గతంలో లబ్ధిదారులు ముందుగా సొంత డబ్బులతో సిలిండర్ బుక్ చేసుకుని ఆ తర్వాత రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడవలసి ఉండేది. దీనికి కారణంగా చాలామంది కుటుంబాల్లో ఆర్థిక భారం ఇబ్బందులు కలిగేవి. ఈ అసౌకర్యాన్ని పూర్తిగా దూరం చేస్తూ ప్రభుత్వం కొత్తగా ప్రణాళిక చేసింది. ఇకపై సిలిండర్ బుకింగ్ తో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి.
నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారిని బ్యాంకు ఖాతాలో నిర్ణీత నగదు జమ చేయాలని నిర్ణయించుకున్నారు. సం||రంలో 3 LPG సిలిండర్లు అందజేసే క్రమంలో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక LPG సిలిండర్ చొప్పున ముందుగానే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం కోరుతుంది. సిలిండర్ బుకింగ్ చేసే దానికి సంబంధం లేకుండా డబ్బులు ఖాతాలో పడడం విశేషంగా గ్రామీణ ప్రాంతాల నివసించే నిరుపేద మహిళలకు ఆర్థికంగా పెద్ద ఊరట ఇస్తుంది. గ్యాస్ డబ్బులు కోసం ఎవరిని సంప్రదించిన అవసరం లేదు. లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం జరగకుండా పారదర్శకంగా ఈ పథకం వేగంగా సమర్థవంతంగా అర్హులకు చేరుతుంది. దీపం 2 పథకం నిరుపేద కుటుంబాలకు మహిళ ఆర్థిక భారం తగ్గించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏటా ఉచిత 3 గ్యాస్ సిలిండర్ అందించడం ద్వారా మహిళలకు ఆర్థికంగా ఊరట కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలు మరియు నిరుపేద కుటుంబాలకు ఇంధన అవసరాలను సులువుగా తీర్చడానికి దీపం 2 పథకంలో మార్పులకు చంద్రబాబు ఏపీ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించవలసి ఉంది

