తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. అయితే ఇలా చేయండి | AP Thalliki Vandanam Scheme 2026
AP Thalliki Vandanam Scheme 2026 money not deposited in the account?.. But do this : తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో ఇంకా పడలేదా.. ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. తల్లికి వందనం నిధులు విడుదల ప్రక్రియను విడుదల వారిగా చేపడుతూ జూలై 24 తేదీ వరకు అర్హత కలిగిన ఖాతాలలో జమ చేయనున్నది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా రాకపోతే.. ఏం చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒకవేళ అర్హత కలిగి ఉన్న డబ్బులు రాకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థి ఆధార్ కార్డు వివరాలు సమర్పించి సమస్యను నమోదు చేసే అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారు. గ్రామంలో నెలకు ఆదాయం 10000 లోపు పట్టణాల్లో 12 వేల లోపు ఉండటం, రేషన్ కార్డు కలిగి ఉండటం వంటి అర్హతలు తప్పనిసరి.. గత సంవత్సరంలో లబ్ధి పొంది, తాజాగా అనర్హత జాబితాలో చేరడం, ఇతర సమస్యలతో పథకం వర్తించదని వారు రేపటి నుంచి పది రోజుల వరకు గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకన్నా ముందు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కు వెళ్లి అమౌంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా NPCI మ్యాపింగ్ అయిందా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
తల్లి ఖాతాకు బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింకు, NPCI మ్యాపింగు & ఈకేవిసి అవన్నీ ఉండి కూడా తల్లికి వందనం పడకపోతే గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించి గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. అలాగే విద్యుత్ బిల్లుల సహా ఇతర లోపాలు వల్ల లబ్ధి పొందని వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సచివాలయంలో జాబితాలపై అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరణ ఈనెల 22 నుంచి ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణ అదనపు అర్హత జాబితా రూపు కల్పన 04 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు ఉంటుంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత సెకండ్ మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? లేదా? ఇలా చెక్ చేసుకోండి
పద్ధతి 1. ముందుగా అభ్యర్థులు Google Play Store నుంచి LEAP App డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో విద్యార్థి వివరాలు ఇచ్చి లాగిన్ ఎంచుకోండి. Payment status పైన క్లిక్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
పద్ధతి 2. అభ్యర్థులు BM పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా అధికార వెబ్సైట్ ని https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఓపెన్ చేయండి. అందులో ఆధార్ నెంబరు, తల్లికి వందనం సెలెక్ట్ చేసి & ఇయర్ సెలెక్ట్ చేస్తే మీ స్టేటస్ అని తెలుస్తుంది.

పద్ధతి 3. ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నర్ ద్వారా 9552300009 నెంబర్ కు HI సెండ్ చేయండి ఆ తర్వాత choice service పైన క్లిక్ చేయండి. అందులో Thalliki Vandanam status పైన క్లిక్ చేయండి. OPEN FORM వస్తుంది దానిపై క్లిక్ చేసి విద్యార్థి ఆధార్ కార్డు ఎంటర్ చేసి తల్లికి వందనం స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైవ్ అన్నిట్లో స్టేటస్ లో ఎలిజిబుల్ అని వస్తే తప్పకుండా మీ బ్యాంకు దగ్గరికి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి.


