Big Update : 7th, 12th అర్హతతో 5,538 టీచర్ & ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Pre Primary School Instructor & Aaya Notification 2026 Apply Now

Big Update : 7th, 12th అర్హతతో 5,538 టీచర్ & ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Pre Primary School Instructor & Aaya Notification 2026 Apply Now

Pre Primary School Instructor & Aaya jobs recruitment 2026 check notification details and apply now : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, LKG, UKG తరగతుల నిర్వహణ కోసం టీచర్లు (ఇన్‌స్ట్రక్టర్) & ఆయాల నియామకాలకు జిల్లాల వారీగా 5,538 ఉద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇంటర్ అర్హతతో టీచర్లకు (ఇన్‌స్ట్రక్టర్) పోస్టులు నెలకు ₹8,000, 7th అర్హతతో ఆయాలకు ₹6,000 గౌరవ వేతనం ఇస్తారు. ఈ జాబ్స్ కి స్థానికంగా ఉండే మహిళలకే ప్రాధాన్యం. రాష్ట్రవ్యాప్తంగా 2,769 ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 2,769 టీచర్లు (ఇన్‌స్ట్రక్టర్), 2,769 ఆయాల పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ నియామకాలు జిల్లా కలెక్టర్లు, మండల విద్యాధికారి (MEO) ఆధ్వర్యంలో జరుగుతాయి.

జిల్లాలోని వివిధ మండలాలలో గుర్తించబడిన 118 ప్రాథమిక పాఠశాలలలో ఫ్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించుటకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినది. ఈ పాఠశాలలలో ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయాలుగా పనిచేయుటకు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరడమైనది. ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయులుగా పని చేయుటకు ఇంటర్ ఉత్తీర్ణులైన, ఆయాలుగా పని చేయుటకు 7వ తరగతి ఉత్తర్ణులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. వయోపరిమితి 18 నుండి 44 సంవత్సరాల లలోపు ఉండాలి. వీరు తమ దరఖాస్తులను ఆయా మండల విద్యాధికారులకు (MEOలకు) ది.08.06.2026 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించగలరు. దరఖాస్తుతో పాటు విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటు ఇతర పత్రాల జిరాక్స్ పత్రాలను సమర్పించాలి. నియామకం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగును. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం. ఒక విద్యా సంవత్సరంలో కేవలం 10నెలలకు మాత్రమే పారితోషికం చెల్లించబడును, మరియు వీరిని ఎప్పుడైనా తొలగించుటకు జిల్లా విద్యాశాఖాధికారికి పూర్తి అధికారం కలదు.

నియామకానికి సంబంధించి నియమ నిబంధనలు:

1. ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల వరకు విద్యార్హత: ఇంటర్ ఉత్తీర్ణత

2. ఆయా కొరకు విద్యార్హత : 7వ తరగతి ఉత్తీర్ణత

3. ముందుగా ఈ వరుసలో ప్రాధాన్యత ఇవ్వబడును :

> ఫ్రీ ప్రైమరీ పాఠశాల ఉన్న హాబిటేషన్ లో నివసించేవారికి

> ఫ్రీ ప్రైమరీ పాఠశాల ఉన్న గ్రామపంచాయతీ లో నివసించేవారికి

> ఆ మండలంలో నివసించేవారికి

> ఆ జిల్లాలో నివసించే వారికి

ఫ్రీ ప్రైమరీ తరగతుల కొరకు ఎన్నికైన పాఠశాలల వివరాల కొరకు ఆయా మండల విద్యాశాఖాధికారులనుండి వివరాలు తెలుసుకోగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *