Anganwadi Jobs : No Fee, No Exam నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు శుభవార్త.. 10th అర్హతతో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగ భర్తీ.. చివరి తేదీ ఇవే

Anganwadi Jobs : No Fee, No Exam నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు శుభవార్త.. 10th అర్హతతో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగ భర్తీ.. చివరి తేదీ ఇవే

Andhra Pradesh Anganwadi Worker Vacancies All Details In Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల.

జిల్లాలో గల ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో 06 అంగన్వాడి టీచర్ ఖాళీల భర్తీ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. భీమవరం & విశాఖపట్నం ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 10th ఉత్తీర్ణత, వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 01. రాత పరీక్ష లేకుండా విద్యా అర్హత ఆధారంగా, రోస్టర్ ప్రకారంగా ఎంపిక చేస్తారు.

అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి

1.ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.

2. అంగన్వాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.

3. తేది 01.07.2026 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.

4. నోటిఫై చేయబడిన SC/ST అంగన్వాడి కేంద్రములకు SC/S T అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన SC/ST అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును

5. ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్ధులు మాత్రమే సదరు పోస్టునకు ఆర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు కచ్చితంగా జతపరచవలెను (SC/ST/BC/EWS/Minor Locomotor Disability/Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూ దరఖాస్తు చేసుకొనవచ్చును

అంగనవాడి కార్యకర్త పోస్టుల నియామక విధానము

1.10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత : 50 మార్కులు

2. ఫ్రీ స్కూల్ టీచర్ టైనింగ్ / క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ECE వర్కర్ గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడువు) : 05 మార్కులు

3. వితంతువులకు : 05 మార్కులు

4. మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు : 05 మార్కులు

5. పూర్తి అనాధ లేదా క్రష్ మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి : 05 మార్కులు

6. ఆర్హత కలిగిన వికలాంగులకు : 05 మార్కులు

7. మౌఖిక ఇంటర్వ్యూ : 20 మార్కులు మొత్తం 100 మార్కులుకు ఉంటాయి.

పై తెలుపబడిన 1 నుండి 5 పారా మీటర్లకు సంబంధిచిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన దృవీకరణ పత్రములు నకలు లు మరియు పైన తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబంధించిన దృవీకరణ పత్రములు నకలులు ఏదైన గజిటెడ్ అధికారి చే సంతకం గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరచవలయును. అట్లు జతపరచని యెడల వాటికి సంబంధించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

అంగనవాడి టీచర్ ఉద్యోగాలకు జీత వివరాలు  : అంగన్వాడీ కార్యకర్త నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థిలకు ప్రభుత్వం నిబందనల ప్రకారం గౌరవ వేతనము నెలకు Rs. 11,500/-మాత్రమే చెల్లించబడును.

ఎంపిక ప్రక్రియ : అర్హత పొందిన అభ్యర్ధులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. అర్హత కలిగిన కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వవలసినదిగా తెలియజేయడమైనది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా తో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్నీ దృవీకరణ పత్రములను ఏదైన గజిటెడ్ అధికారిచే సంతకం చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పధక అధికారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం మరియు విశాఖపట్నం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును. ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.

అంగన్వాడి టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు క్రింద డాక్యుమెంట్ను జతపరచాలి

1. జన్మస్థల/నివాస ధృవీకరణ పత్రం.

2. ఆధార్

3. రేషన్ కార్డు

4. ఓటరు గుర్తింపు కార్డు.

5. విద్యా సర్టిఫికేట్

6. కుల ధృవీకరణ పత్రం (ఎస్సీ/ఎస్టీ/బీసీ విషయంలో)

7. EWS సర్టిఫికేట్ (అవసరమైతే)

8. వైకల్య ధృవీకరణ పత్రం (అవసరమైతే)

9. ఇతర అవసరమైన సర్టిఫికేట్లు

కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన మహిళా అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్ట్రేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయంనకు నేరుగా గాని /పోస్టు ద్వారా గాని తేదీ 20-05-2026 నుండి 01-06-2026 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *