AP విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ | AP Power Substation Assistant Executive Engineers (AEE) Job Recruitment 2026 all details in Telugu
AP Power Substation APSPDCL Assistant Executive Engineers (AEE) Job Notification 2026 : నిరుద్యోగులకు భారీ శుభవార్త ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలలో (AP Transco, AP Genco, APSPDCL, APCPDCL & APEPDCL) 629 ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (AEE) ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ వెల్లడి కానున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 629 AEE పోస్టుల భర్తీకి పచ్చ జెండా ప్రభుత్వ అనుమతి వచ్చింది. ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక జాబ్ క్యాలెండర్ భాగంగా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే విద్యా శాఖలో 19 యూనివర్సిటీలలో 1523 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. విద్యుత్ సమస్యల అవసరాలను అనుగుణంగా ఎలక్ట్రానికల్ సివిల్ టెలికాం విభాగాలలో నియామకాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వివిధ సబ్ స్టేషన్ లో ఏపీ ట్రాన్స్కో : 200 పోస్టులు, ఏపీ జెన్కో : 100 పోస్టులు, ఏపీఎస్పీడీసీఎల్ : 134 పోస్టులు, ఏపీసీపీడీసీఎల్ : 60 పోస్టులు & ఏపీఈపీడీసీఎల్ : 135 మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అనుమతినించేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ గారు గండిపాటి రవీంద్ర కుమార్ ఆంధ్రప్రదేశ్ బహుజా విద్య ఉద్యోగ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
•విద్యా అర్హత : నోటిఫికేషన్ నాటికి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బి.ఇ/బి.టెక్/ఎ.ఎం.ఐ.ఇ. లేదా అదే విభాగంలో తత్సమాన అర్హతను రెగ్యులర్ ప్రాతిపదికన కలిగి ఉండాలి.
•వయస్సు: నోటిఫికేషన్ తేదీ నాటికి ఓసీ అభ్యర్థులకు వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థుల విషయంలో గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల వరకు మరియు దివ్యాంగులైన అభ్యర్థుల విషయంలో 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
•అప్లికేషన్ ఫీజు : ప్రతి దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200/- (రెండు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి. సాధారణ వర్గం కింద దరఖాస్తుదారులు రూ.200/- తో పాటు పరీక్ష రుసుముగా రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) కూడా చెల్లించాలి. గమనిక: ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు మరియు దివ్యాంగులకు చెందిన దరఖాస్తుదారులు రూ.500/- చెల్లించనవసరం లేదు.
•నెల జీతం : రూ.60155-2485-65125-2900-79625-3335-92965 శిక్షణతో కూడిన ప్రొబేషన్: ఈ పోస్టుకు నియమితులైన అభ్యర్థులను 2 సంవత్సరాల కాలానికి శిక్షణతో కూడిన ప్రొబేషన్‌పై ఉంచుతారు.
•పోస్టింగ్ ప్రదేశం: నియమించబడిన అభ్యర్థులు గ్రామీణ కార్యకలాపాల విభాగాలలో లేదా APSPDCLలో ఎక్కడైనా పని చేయవలసి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి : APSPDCL వెబ్‌సైట్ http://apspdcl.egg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🛑Notification Pdf Click Here

