AP Jobs Calendar 2026 : రాష్ట్రంలో 19 యూనివర్సిటీలలో 1523 భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| AP Higher Education Department Universities Recruitment 2026 Apply Now

AP Jobs Calendar 2026 : రాష్ట్రంలో 19 యూనివర్సిటీలలో 1523 భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| AP Higher Education Department Universities Recruitment 2026 Apply Now

AP Universities Recruitment 2026 Professor, Associate Professor, Assistant Professor, Lecturer, Assistant Librarian Job Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ లో 1523 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ ఈనెల 18 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నోటిఫికేషన్ లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రరీ & లైబ్రరీ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. చివరి తేదీ 8వ లోపల https://apuniversitiesrecruitment.apcfss.in/  ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 యూనివర్సిటీలలో 1523 ఉద్యోగుల భర్తీకి ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 63 ప్రొఫెసర్ ఉద్యోగాలు, 334 అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 02 అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు & 104 లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో 1523 పోస్టులులో బ్యాక్ లాగ్ 279, రెగ్యులర్ గా 1244 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ మొదలైన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం నుండి పొందవచ్చు. వెబ్‌సైట్: www.rgukt.in లేదా https://apuniversitiesrecruitment.apcfss.ఇన్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 18.05.2026 నుండి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 08.06.2026 (సాయంత్రం 5.00 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

63 ప్రొఫెసర్ ఉద్యోగాలు, 334 అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, 02 అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు & 104 లెక్చరర్ పోస్టుల ఉన్నాయి. 

విద్యా అర్హత :

ప్రొఫెసర్  :: మేనేజ్‌మెంట్‌లో లేదా సంబంధిత రంగంలో పిహెచ్.డి డిగ్రీ మరియు సంబంధిత శాఖలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత. మరియు బోధన/పరిశోధన/పరిశ్రమ రంగంలో కనీసం 10 (పది) సంవత్సరాల అనుభవం ఉండాలి, అందులో కనీసం 3 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్‌కు సమానమైన హోదాలో పనిచేసి ఉండాలి.bమరియు అర్హత తేదీ వరకు SCI జర్నల్స్/UGC/AICTE ఆమోదిత జాబితా జర్నల్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో కనీసం 6 పరిశోధన ప్రచురణలు, మరియు సూపర్‌వైజర్/కో-సూపర్‌వైజర్‌గా మార్గదర్శకత్వం వహించిన కనీసం 2 విజయవంతమైన Ph.D.లు (లేదా) అర్హత తేదీ నాటికి SCI జర్నల్స్/UGC/AICTE ఆమోదిత జర్నల్స్ జాబితాలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో కనీసం 10 పరిశోధన ప్రచురణలు ఉండాలి.

అసోసియేట్ ప్రొఫెసర్ :: భారతీయ విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (లేదా గ్రేడింగ్ విధానం అనుసరించే చోట పాయింట్-స్కేల్‌లో సమానమైన గ్రేడ్), లేదా గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయం నుండి సమానమైన డిగ్రీ.  పైన పేర్కొన్న అర్హతలను నెరవేర్చడంతో పాటు, అభ్యర్థి UGC లేదా CSIR, లేదా AP – నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)లో ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ :: భారతీయ విశ్వవిద్యాలయం నుండి బయోకెమిస్ట్రీలో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (లేదా గ్రేడింగ్ విధానం అనుసరించే చోట పాయింట్-స్కేల్‌లో సమానమైన గ్రేడ్), లేదా గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయం నుండి సమానమైన డిగ్రీ. పైన పేర్కొన్న అర్హతలను నెరవేర్చడంతో పాటు, అభ్యర్థి UGC లేదా CSIR నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా AP – SLET/AP SET లో ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ లైబ్రేరియన్ :: లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్‌లో 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ. తప్పనిసరిగా NET/SLET/SET లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా UGC నిబంధనల ప్రకారం Ph.D. కలిగి ఉండాలి. గ్రంథాలయ ఆటోమేషన్, డిజిటైజేషన్ మరియు సమాచార వ్యవస్థల పరిజ్ఞానం అవసరం కావచ్చు.

లెక్చరర్ :: భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎం.ఎస్.సి., లేదా బి.ఎస్.సి (ఆనర్స్)) లేదా దానికి సమానమైన ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. కేంద్ర చట్టం, రాష్ట్ర చట్టం, లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన సంస్థ నుండి గానీ, లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి గానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పరీక్షలో కనీసం 50% మార్కులతో సమానమైన అర్హత కలిగి ఉండాలి.

గరిష్ట వయో పరిమితి :  01/07/2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మరియు 44 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ నియామకానికి అర్హులు కారు. అయితే, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విషయంలో గరిష్ట వయోపరిమితి 49 సంవత్సరాలుగా మరియు బెంచ్‌మార్క్ వైకల్యాలున్న అభ్యర్థుల విషయంలో గరిష్ట వయోపరిమితి 54 సంవత్సరాలుగా ఉంటుంది.

నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు జీతం రూ.57,100/-1,47,760/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (https://apuniversitiesrecruitment.apcfss.in/) లో

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు ఫారమ్ పోర్టల్‌లో అందించిన లింక్ ద్వారా దరఖాస్తు రుసుము (తిరిగి చెల్లించబడనిది) చెల్లించాలి:

•రిజర్వేషన్ లేని/BC/EWS :: 2500.00

•ఎస్సీ/ఎస్టీ/పీబీడీలు :: 2000.00

•ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIS), 50 డాలర్లకు సమానమైన మొత్తాన్ని రూపాయలలో చెల్లించాలి (అనగా, రూ.4,200.00) ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క రకంగా అప్లికేషన్ ఫీజు ఉంది.

•ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ మొదలైన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం నుండి పొందవచ్చు. వెబ్‌సైట్: https://apuniversitiesrecruitment.apcfss.in. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 18.05.2026 నుండి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 08.06.2026 (సాయంత్రం 5.00 గంటల IST వరకు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ :: 18.05.2026

ఆన్లైన్దరఖాస్తుల చివరి తేదీ :: 08.06.2026

🛑Notification PDF Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *