Latest Jobs : 10th తరగతి ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Navy ANC Recruitment 2026 Apply Now
Indian Navy ANC Recruitment 2026 Latest HQ ANC Multi Tasking Staff & LDC Job Notification 2026 Apply Now : ప్రధాన కార్యాలయం, అండమాన్ & నికోబార్ కమాండ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) (ఆఫీస్ & ట్రైనింగ్) పోస్టుల భర్తీ ఆఫ్‌లైన్ దరఖాస్తులు మాత్రమ స్వీకరించబడతాయి. అప్లికేషన్ ఈనెల 18 నుంచి ప్రారంభమై 15 మే 2026 వరకు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

అండమాన్ & నికోబార్ కమాండ్ ప్రధాన కార్యాలయం, శ్రీ విజయపురం, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఆఫీస్ & ట్రైనింగ్) పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ + కంప్యూటర్ టైపింగ్ అర్హత కలిగిన వారు అర్హులు. పోస్టును అనుసరించి 19,900-63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు. వయసు 18-27 ఏళ్లు ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 15, 2026 లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 08 ఉన్నాయి.
విద్యా అర్హత :
•లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) :: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత మరియు నైపుణ్య పరీక్ష: కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగల వేగం (అనుమతించబడిన సమయం-10 నిమిషాలు). (నిమిషానికి 35 పదాలు మరియు నిమిషానికి 30 పదాలు అంటే, ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌ల చొప్పున గంటకు 10500 కీ డిప్రెషన్‌లు/గంటకు 9000 కీ డిప్రెషన్‌లు).
•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) :: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత.

గరిష్ట వయస్సు : 18.05.2026 నాటికి MTS ఉద్యోగాలకు 18 నుండి 25 సం||రాలు & లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుకు 18 నుండి 27 సం||రాలు మధ్య ఉండాలి.

•నెల జీతం : జీతం లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుకు రూ.19,900-63,200/- మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుకు రూ.18,000-56,900/- నెల జీతం చెల్లించబడతాయి.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
చిరునామా :
THE OFFICER-IN-CHARGE
CIVILIAN RECRUITMENT CELL
NAVAL SHIP REPAIR YARD
PO-HADDO, SRI VIJAYA PURAM-744102
SOUTH ANDAMAN, ANDAMAN & NICOBAR ISLANDS
•ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చూస్తారు.
•దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
• ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తిగల మరియు అర్హతగల అభ్యర్థులు ఇతర ఫారమ్‌లను www.andamannicobar.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ: 18 ఏప్రిల్ 2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ: 15 మే 2026

🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here

