TS Inter Exam 2026 : తెలంగాణ ఇంటర్ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ & అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్ టేబుల్ పూర్తి వివరాలు
TS Inter Advanced Supplementary Exams Timetable 2026 TS Inter Recounting Re-verification All Details In Telugu : తెలంగాణ ఇంటర్ ప్రధమ సంవత్సరంలో జనరల్ మరియు ఒకేషనల్ కలిపి మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో 3,23,807 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్ 5,07,948 మంది పరీక్షలు రాయగా 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. ఇంటర్ పరీక్షలు తప్పిన విద్యార్థుల కోసం మే 13 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ పరీక్షలు రాసేందుకు రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ నందు ఫీజు చెల్లించవలెను.

తెలంగాణ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ కొరకు ఒక్కొక్క పేపర్ కోసం రూ.100/- రూపాయలు చెల్లించాలి రీ వెరిఫికేషన్ కోసం ఒక్కొక్క పేపర్ కు రూ.800/- చెల్లించవలసి ఉంటుంది. వీటి అన్నిటి కోసం https://tgbienew.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా మాత్రమే చెల్లించలించాలి. సప్లమెంటరీ ఫీజులు మాత్రం ఆయా కళాశాల ద్వారా చెల్లించాలి అడ్వాన్స్ సప్లమెంటరీ పాసి రెగ్యులర్ పాసైనట్లయితే భావిస్తారు ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ పరీక్షలు తప్పిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదివారం విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19 తేదీ లోగో ముగిస్తున్నారు. మొదటి సంవత్సర పరీక్షలు ఉదయం 09:00 గంటల నుంచి 12:00 గంటల వరకు రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 1000కి 997 మార్కుల సాధించారు వారు ముగ్గురు కూడా అమ్మాయిలు కావడం విశేషం ఇంటర్ బోర్డు వర్గాల నుంచి ఈ సమాచారం రావడం జరిగింది.


🛑Official Website Click Here

