No Fee.. No Exam | 10th అర్హతతో గ్రామ, వార్డు సచివాలయాలలో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా జాబ్ పొందండి | AP ICDS Anganwadi Helper Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

No Fee.. No Exam | 10th అర్హతతో గ్రామ, వార్డు సచివాలయాలలో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా జాబ్ పొందండి | AP ICDS Anganwadi Helper Recruitment 2026 Apply Now

ICDS Anganwadi Recruitment 2026 Latest Anganwadi Helper Job Notification 2026 Apply Now: పరీక్ష లేదు, ఫీజు లేకుండా డైరెక్ట్ గా అప్లై చేస్తే అంగన్వాడీ ఆయా ఉద్యోగం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి,  జిల్లా- మడకశిర డివిజన్ ల లో ఉండే 2 ఇ.సి.డి. యస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ ఆయాల పోస్టులకు అర్హులైన అభ్యర్థులనుండి కొత్త దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 10 ఏప్రిల్ 2026 నుంచి ఆఫ్ లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ 16 ఏప్రిల్ 2026 వరకు ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగుల కోసం కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు స్థానికంగా నివసిస్తూ వివాహమైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. టైం లేదు వెంటనే అప్లై చేసుకోండి. వేటివిటి సర్టిఫికేట్/రెసిడెన్స్/ఆధార్, మార్క్స్ మెమో, తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన కులము & నివాసం (యెస్.సి/ఎస్.టి/బి.సి.అయితే, వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన దృన పత్రమును & దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తో పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను.

ICDS Anganwadi Helper Job Notification 2026 apply 55 Vacancy Overview :

సంస్థ పేరు ::జిల్లా మహిళాభివృద్ది శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో జాబ్స్
పోస్ట్ పేరు :: అంగన్వాడి సహాయకులు పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::55
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 21-35 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.7,000/-
దరఖాస్తు ప్రారంభం :: 10.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 16.04.2026
అప్లికేషన్ మోడ్ :: www.srisathyasal.ap.gov.in

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడి సహాయకులు పోస్ట్ ఉన్నాయి. మొత్తం పోస్టులు 55 పోస్టులు ఉన్నాయి.

•గుడిబండ : 17
•మడకశిర : 38 పోస్టులు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి.

»విద్యా అర్హత ::

•అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్థులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను. అభ్యర్తులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము. పుట్టిన తేది. పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే దృవీకరణ పత్రాలను జతపరచవలయును.

»నెల జీతం :  ఈ జాబ్స్ కి నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ. 11500 మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ. 7000/- చెల్లించబడును.

»వయోపరిమితి: 01.07.2026 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.

»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీ లేదు.

»ఎంపిక విధానం: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా అనుభవం మరియు ఏజ్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

•రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కంద్రాల వారిగా పాజెక్టకు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.

•అభ్యర్తులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము. పుట్టిన తేది. పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే దృవీకరణ పత్రాలను జతపరచవలయును.

•అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.

•CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.

•కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి జతపరచవలయును.

దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

»దరఖాస్తు విధానం : పై సూచికననుసరించి జిల్లాలో ఉన్న మడకశిర రెవిన్యూ డివిజన్ కు సంబంధించి 2 ఇ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆహ్వానించడమైనది వాటి ఖాళీలను ప్రభుత్వ వెబ్సైట్ www.srisathyasai.ap.gov.in నందు పొందుపరుచవలసినదిగా కోరుచున్నాము. ఖాళీలకు సంబంధించిన నియమనిభందనలు మరియు ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టుల వివరాలను ఇందు వెంట జతపరుచుచున్నాము.

అంగన్వాడి నియామకం కొరకు పై అనుబంధములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 16-04-2026 వరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో 16-04-2026 వ తేది సాయంత్రము 5-00 PM వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. నిర్ణీత గడువు లోపల దరఖాస్తును సమర్పించి రసీదు పొందవలయును గడువు దాటిన పిమ్మట ఎటువంటి. పరిస్థితులలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.

ముఖ్యమైన తేదీ వివరాలు

•ఆఫ్ లైన్ లో అప్లికేషన్ ప్రారంభ తేదీ :: 10/04/2026 (ఉదయం 10:00 గంటలకు)

ఆఫ్ లైన్ లో అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ :: 16/04/2026 (సాయంత్రము 5-00 PM).

🛑1st Notification Application Pdf Click Here

🛑2nd Notification Application Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *