10th, Inter Results 2026 : టెన్త్, ఇంటర్ ఫలితాలు… ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటే?
Andhra Pradesh and Telangana 10th, Inter Results 2026 Date : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అధికారికంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని విడుదల చేయలేదు. ఎప్పుడొచ్చి అవకాశం ఉందని అంచనా మాత్రమే.. ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 3వ వారంలో ఇంటర్ ఫలితాలు, టెన్త్ రిజల్ట్స్ ఈనెల ఆఖరిలో వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈనెల 15 నుంచి 20వ తేదీ లోపల ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. టెన్త్ పరీక్షలు ఇంకా ముగించలేదు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ఈనెల 9వ తేదీన పూర్తి అవుతుంది. ఆ తరువాత మార్కులు లెక్కేసి ఆన్లైన్లో ఎక్కించడానికి ఒక వారం టైం పడుతుంది. ఆ తరువాత ఇంటర్మీడియట్ ఫలితాలు మార్చి 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో రిజల్ట్స్ వచ్చి అవకాశాలు ఉన్నాయి. అలాగే పదో తరగతి పరీక్షలు మూల్యంకరణ ఈనెల 15 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత రిజల్ట్స్ ప్రాసెస్ చేసి ఈనెల 25వ తేదీ తర్వాత ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు రెగ్యులర్ విద్యార్థులు 6,22,152, ప్రవేట్ విద్యార్థులు 19,568 మంది పరీక్షలు రాశారు. అలాగే ఇంటర్మీడియట్ 1st ఇయర్ 5,21,266 మంది సెకండ్ ఇయర్ 5,16,646 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ మూడవ వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ నాలుగో వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నాయి.

విద్యార్థులకు ముఖ్య గమనిక AP 10వ తరగతి ఫలితాల కోసం https://bse.ap.gov.in/ మరియు AP ఇంటర్ ఫలితాల కోసం https://bie.ap.gov.in/ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం https://tgbieht.cgg.gov.in/ వెబ్సైట్ ను సందర్శించండి. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.

