India Post GDS Results 2026 Release | India Post GDS 2nd merit list 2026 Date | Postal GDS Document Verification Process
India Post GDS Results 2026 release | India Post GDS Result 2026 Pdf Download: ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026 విడుదలయ్యాయి సర్కిల్ వారీగా 1st మెరిట్ లిస్ట్ PDF డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది 2026 Cut off ఎంత అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాలు అధికార వెబ్సైట్లో మార్చి 6వ తేదీన విడుదల చేయడం జరిగింది. గ్రామీణ డాగ్ సేవకు జిడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్కిల్ మరియు స్టేట్ వారిగా 1st మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేశారు.

2026 సంవత్సరంలో ఇండియన్ పోస్ట్ పరిధిలో GDS, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవక్ మొత్తం 28,636 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఫలితాలు ప్రతి పోస్టల్ సర్కిల్ స్టేట్ వారీగా విడివిడిగా https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్లో Pdf ఫారంలో ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది.
పోస్ట్ GDS ఉద్యోగాలకు రాత పరీక్షలు లేకుండా పదో తరగతి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు.
ఇండియా పోస్ట్ జీడిస్ ఫలితాలు ముఖ్యమైన వివరాలు
• సంస్థ : ఇండియా పోస్ట్
•నియామకం :: గ్రామీణ టాక్ సేవక్ (GDS) ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026
•పోస్ట్ వివరాలు : డాగ్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
•మొత్తం ఖాళీలు :: 28,636 పోస్టులు
•ఫలితాల విధానం : ఆన్లైన్లో
•ఫలితాలు విడుదల తేదీ : 06 మర్చి 2026
•పత్రాలను ధ్రువీకరణ చివరి తేదీ : 23 మర్చి 2026
•ఎంపిక ప్రక్రియ : 1st మెరిట్ లిస్ట్ – డాక్యుమెంట్ వెరిఫికేషన్- తుది జాబితా విడుదలవుతుంది
•అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/
GDS ఫలితాలు 2026 సర్కిల్ వారీగా పిడిఎఫ్ డౌన్లోడ్ డైరెక్ట్ లింకు : ఇండియా పోస్టల్ జిడిఎస్ మెరిట్ జాబితా 2026 అన్ని సర్కిల్ వారిగా 23 పోస్టల్ సర్కిల్లో విడివిడిగా విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1st మెరిట్ లిస్టులో 1048 మంది అభ్యర్థులు, తెలంగాణలో 607 మంది మొదటి మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయ్యారు.
🛑 Andhra Pradesh Post GDS 1st Merit List Direct Pdf
🛑Telangana Post GDS 1st Merit List Release Pdf
ఇండియా పోస్ట్ GDS ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం
1. అభ్యర్థులు ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైటు ఓపెన్ చేయండి.
2. అందులో హోమ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ కింద “Shortlisted Candidates: Schedule-1, January-2026” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. అందులో మీరు అప్లై చేసిన సర్కిల్ లేదా స్టేట్ పై క్లిక్ చేయండి.. అప్పుడు “List of shortlisted candidates” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
4. మీకు PDF డౌన్లోడ్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మీ నేమ్ తో సెట్ చేసి మీ పేరు ఉన్నట్లయితే.. ఆ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్టు. అభ్యర్థులు 23/03/2026న లేదా అంతకు ముందు వారు ఎంపిక చేయబడిన డివిజన్‌లోని డివిజనల్ కార్యాలయంలో వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.
పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్ వివరాలు
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అవసరమైన కింద ఇచ్చిన విధంగా డాక్యుమెంటుతో డివిజన్ కార్యాలయంలో వెళ్లేటప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి.
•10వ తరగతి మార్కులు మార్క్ లిస్ట్ జాబితా
• Date Of Birth సర్టిఫికెట్
• కుల ధ్రువీకన పత్రం (SC, ST & OBC అయితే)
•EWS సర్టిఫికెట్ వర్తిస్తే
•PWD సర్టిఫికెట్ వర్తిస్తే
•ఆధార్ కార్డు, ఓటర్ ఐడి & పాన్ కార్డు ఏదైనా ఒకటి.
•నెగిటివిటీ సర్టిఫికెట్
•స్థానిక భాషా సర్టిఫికెట్
•కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్
•కొత్తగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
•అప్లికేషన్ ప్రింట్ అవుట్… పై చెప్పినటువంటి డాక్యుమెంట్ అన్ని కూడా అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు 2 సెట్ల ఫోటోకాపీలతో రిపోర్ట్ చేయాలి.
ఇండియా పోస్ట్ GDS 2వ & 3వ మెరిట్స్ జాబితా 2026 ఎప్పుడు విడుదలవుతుంది
మొదటి జాబితా 23 మార్చ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ. మిగిలితే ఆ తర్వాత ఒక వారంలోపు సెకండ్ మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.
ముఖ్యమైన లింకు వివరాలు
GDS ఆన్‌లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్-I, జనవరి-2026 – ఆంధ్రప్రదేశ్ సర్కిల్ – జాబితా 1 కోసం https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ ద్వారా 1st మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు.


