Police Jobs: 12th అర్హతతో త్వరలోనే 12,452 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Upcoming 12452 Police Jobs Notification In Telangana : తెలంగాణలో ఉద్యోగ ఖాళీలపై మాజీ సిఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ వివిధ శాఖలో నుండి సమగ్రంగా జాబ్స్ ఖాళీలపై వివరాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ నుండి సమాచారం ఈ కమిటీ అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12452 పోలీస్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 8442 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ (ఎఆర్) – 3271పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్) – 677 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ (ఎఆర్) – 40 పోస్టులు & సబ్ ఇన్స్పెక్టర్ (టీజీఎస్పీ) – 22 పోస్టులు = మొత్తం పోస్టులు : 12,452 పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగులకు కేవలం ఇంటర్మీడియట్ & ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.