Gurukula Jobs : గురుకులాల్లో 3,488 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భర్తీ
Gurukula upcoming 3488 Jobs notification 2025 : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మైనారిటీ గురుకుల విద్యాలయాలలో 3488 ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పూర్తిగా వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థ రాష్ట్ర విద్యారంగ ప్రత్యేక స్థానం ఉంది. విద్యాలయాలలో సిబ్బంది కొరత వల్ల ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యంగా మైనారిటీ సంబంధించిన విద్యాలయ సంస్థలు మరింత స్పష్టం తెలిపారు. ఈ నేపథ్యంలో 3488 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం మరొకసారి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఔట్సోర్సింగ్ పద్ధతి మీద భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసి 31 విభాగాలలో అవసరమైన సిబ్బందిని వెంటనే ఔట్సోర్సింగ్ మీద నియమిస్తామని తెలియజేశారు.
ఔట్సోర్సింగ్ పద్ధతి లో 31 విభాగాలలో పోస్టులు క్రింద విధంగా ప్రోగ్రామర్, సీనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ & ఆఫీస్ అబార్డినేట్ తదితర పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు ప్రిన్సిపాల్ జూనియర్ లెక్చరర్, పిజిటి, టిజిటి, పిడి పోస్టులు కూడా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ విభాగంలో అత్యధికంగా కాలులు దాదాపుగా 1227 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 42 లైబ్రరీ 43 పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించి విద్య అర్హత విషయానికి వస్తే ఆయా పోస్ట్లు అనుసరించి టెన్త్ నుంచి డిగ్రీ పాటు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ లేదా సీటెట్ క్వాలిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🛑Official Website Click Here