AP Jobs : 10th అర్హతతో కొత్త గా 358 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో నోటిఫికేషన్
AYUSH Department Medical Staff On Contract Basis Job Recruitment 2025 : నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) కింద రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో 358 మంది వైద్య సిబ్బందిని ఒప్పంద, పొరుగు సేవల విధానంలో నియమించడానికి ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఖాళీ ఉద్యోగ వివరాలు ఆయుష్ వైద్యులు, ఫైనాన్స్ మేనేజర్లు, రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్లు, మసాజిస్ట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు (DEO), జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు, సైక్రియాట్రిస్ట్లు, కాంపౌండర్ కమ్ ఆఫీస్ అసి స్టెంట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫిజియోథెరపిస్ట్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు, స్వీపర్ కమ్ అటెండర్ పోస్టులు, పంచకర్మ థెరపిస్టులు, మల్టీపర్పస్ వర్కర్లు (ఎంపీడబ్ల్యూ) & స్వీపరు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఇందులో 72 ఎంపీ డబ్ల్యూలు, 45 స్వీపర్ల ఉద్యోగులు అర్హత కలిగి, గతంలో ఎన్ఆర్వాచ్ఎం కింద పనిచేసి విధుల నుంచి తొలగించిన వారితో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మిగిలిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB), ఆయుష్ శాఖల ద్వారా భర్తీ చేస్తారు.

ప్రస్తుతం స్టేట్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-25 ఆధారంగా వేతనాలు పెంచుతామని, 2024 ఏప్రిల్ నుంచి చెల్లించిన వేతనాలు చెల్లిస్తామని, ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.