Rythu Bharosa Scheme 2025 : రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
Rythu Bharosa Scheme 2025: రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 18 (తేదీ: 10-01-2025) విడుదల చేసింది. ఈ ప్రకారం, భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతులకు పెట్టుబడి సహాయం అందించబడుతుంది.
ఈసారి రైతు భరోసా పథకం జీవోను కూడా తెలుగులో జారీ చేసి, రైతులకు మరింత సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టింది. ఈనెల 26వ తేదీ నుంచి ఈ సహాయం అందించబడుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముఖ్యాంశాలు:
• రైతు భరోసా పథకం కింద లబ్ధిదారుల వివరాలను భూభారతి పోర్టల్ ఆధారంగా పరిశీలించి, నేరుగా రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12,000 బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయి.
• రైతు భరోసా పథకం లక్ష్యాన్ని సాకారం చేయడానికి పట్టాదారు రైతుల భూముల వివరాలు స్పష్టతతో నమోదు చేయడం తప్పనిసరి.
• ROFR పట్టాదారులు కూడా రైతుభరోసాకి అర్హులు.