India Post Office GDS 3rd Merit List 2024 Out : Postal GDS Direct Result Link Andhra Pradesh in Telangana

India Post Office GDS 3rd Merit List 2024 Out : Postal GDS Direct Result Link Andhra Pradesh in Telangana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS Direct Result Link : గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల మూడో జాబితా కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో పోస్టులు భర్తీ చేస్తూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల మూడో జాబితా ఇప్పుడే విడుదల కావడం జరిగింది. ఆగస్టు 19న మొదటి జాబితా, సెప్టెంబర్ 17న రెండో జాబితా విడుదలైన విషయం తెలిసిందే.

ఏపీలో, తెలంగాణలో పోస్టుల వివరాలు
ఈ మొత్తం 44,228 ఉద్యోగాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,355 పోస్టులు, తెలంగాణ రాష్ట్రానికి 981 పోస్టులు కేటాయించారు. ఇప్పటికే రెండో జాబితాలో ఏపీ నుంచి 664 మంది, తెలంగాణ నుంచి 468 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఎంపికైన అభ్యర్థులకు విధులు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ పరిశీలన పూర్తి అయిన తర్వాత నియామక పత్రాలు అందిస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన పత్రాలు: ఆన్లైన్ అప్లికేషన్ ప్రతిని
• పదో తరగతి మార్కుల మెమో (పుట్టిన తేదీ ధ్రువీకరణ)
• స్టడీ సర్టిఫికెట్లు
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
• ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం
• ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం
• దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
• మెడికల్ సర్టిఫికెట్

ఈ పత్రాలను సమర్పించిన తర్వాత, ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది.

🛑Andhra Pradesh India Post Office GDS 3rd Merit List direct PDF click here

🛑 Telangana India Post Office GDS 3rd Merit List direct PDF click here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page