The Sharwani Police Welfare English Medium School Job Recruitment
పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు
>విజయనగరం జైమ్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో ఏఆర్ పోలీస్ లైన్స్ లో నిర్వహించే శార్వాణీ పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐదు ఉపాధ్యాయ, ఒక స్కావెంజర్, ఒక గార్డెనర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ దీపికా ఎం.పాటిల్ శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు.
>సర్సరీ నుంచి ఏడో తరగతి వరకూ నిర్వహించే పాఠశాలలో హెచ్ఎం, ఇంగ్లి ష్ టీచర్, ఎన్విరాన్మెంట్ సైన్స్ టీచర్, మాడ్స్ టీచర్, యూకేజీ టీచర్, ఒక స్కేవంజర్, ఒక గార్డెనర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు .
>అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, రెజ్యూమ్ తో జెరాక్స్ కాపీలను జతపర్చి అక్టోబర్ 5 న ఉద యం 11 గంటలకు నిర్వహించబోయే మౌఖిక పరీక్షకు హాజరుకావాలన్నారు. హెచ్ఎం ఉద్యో గానికి ఎంఏ, బీఈడీ చదివి, టీచింగ్ అనుభవం కలిగి ఉండాలన్నారు.
>ఇంగ్లిష్ ఉపాధ్యా యుని పోస్టుకు ఎంఏ బీఈడీ, ఎన్విరాన్ మెంట్ సైన్స్, మ్యాథ్, యుకేజీ ఉపాధ్యాయని పోస్టుల కు బీఎస్సీ, బీఈడీతో పాటు మెథడాలజీ చదివి ఉండాలన్నారు.
>మరింత సమాచారానికి, సందే హాల నివృత్తికి 94407 96602, 82476 18084 లను సంప్రదించాలని ఎస్పీ కోరారు.