Breaking News : ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు AP పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే
ఆంధ్రప్రదేశ్ లో TDP, జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే, ఏపీలో పింఛన్ రూ.4,000 వేలకు పెంచుతూ ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్ర బాబునాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
•16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ
•ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు.
•సామా జిక పింఛన్లు రూ.4వేలకు పెంపు
•అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేశారు.
పెంచినపెన్షన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని మంత్రులు తెలిపారు. 01 జూలై వృద్ధులకు 3,000 నెలల పెంచిన పెన్షన్తో కలిపి రూ.7,000 వేలు ఇస్తామని చెప్పారు.
AP: పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?
*వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000 (గతంలో ₹3వేలు)
*దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
*కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000
*కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000 (గతంలో ₹5వేలు)
*మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు).