ఆధార్ కార్డు ఉన్న మహిళలకు శుభవార్త ఉచితంగా కుట్టుమిషన్ కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి : Free Sewing Machine to women apply here
Free Sewing Machine (Vishwakarma Yojana scheme) :- కేంద్రం నుంచి మనకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు రిలీజ్ అవుతాయి. కానీ చాలామందికి వాటి గురించి తెలియకుండా స్కీమ్స్ పొందలేకపోతుంటారు అలాగే నష్టపోతుంటారు. అలాంటి స్కీం గురించి ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పథకం అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలు ఫ్రీగా కుట్టుమిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం నుంచి 01 ఫిబ్రవరి, 2023 న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం వివిధ రకాల శిక్షణతో పాటు అధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొదట నైపుణ్యం కోసం ఐదు నుంచి ఏడు రోజులు ఆ తరువాత 15 రోజులు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 500 రూపాయలు అందజేస్తుంది. శిక్షణ తర్వాత 15,000 విలువైనటువంటి కిట్ కూడా మనకు ఫ్రీగా ఇస్తుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వారు ఉచిత శిక్షణ పొందవచ్చు. అలాగే వారి సొంత వ్యాపారం కోసం ప్రారంభించడానికి కేవలం 5% వడ్డీతో ప్రభుత్వం నుంచి గనిష్టంగా 3 లక్షల వరకు రుణం పొందవచ్చు.
ఈ మొత్తంలో రెండు దశల్లో అందచేయడం జరుగుతుంది. మొదటి దశలో 1 లక్ష రుణం అందజేస్తారు. ఆ తర్వాత రెండో దశలో 2 లక్షల రుణం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 18 రకాల వ్యాపారాలకు రుణ సహాయం ఇచ్చే వీలుంటుంది. అందులో భాగంగా వడ్రంగి, శిల్పి, కుండలు, దుస్తులు కుట్టేవారు, చీపుల తయారీ, చెప్పులు కుట్టేవారు, బొమ్మల తయారు చేసే వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అలాగే వివిధ రకాల చాలా వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ అనే పథకం, ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అనుమతిస్తుంది. మీరు ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడే ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వం 15,000 అందిస్తుంది. దానితో పాటు కుట్టు మిషన్ కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించేందుకు సహాయం చేయడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్ పొందాలి అనుకున్న వాళ్లు తప్పనిసరిగా కుట్టుపని తెలిసి ఉండాలి. ఈ పథకంలో ఇంకా చివరి తేదీ నిర్ణయించలేదు మీరు కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మీ ప్రభుత్వం నిర్ణయించబడిన క్రింద ఇవ్వబడిన అర్హత కలిగి ఉండాలి. భారత స్థానిక మహిళలు అయి ఉండాలి. ఈ పథకం ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కోసం మహిళ వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఈ పథకం కు అప్లై చేసుకోవాలి అనుకున్న మహిళ యొక్క కుటుంబ నెలవారీ ఆదాయం 12వేల కన్నా తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలన్న వాళ్లు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికార వెబ్సైటుని సంప్రదించి మీ వివరాలను నమోదు చేసి దరఖాస్తు https://www.pmvishwakarma.gov.in/ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.