ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభం- మార్చ్ 11 2024, భద్రాచలం నుండి ప్రారంభం ప్రారంభించడం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్లు పథకం ఉద్దేశం:- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం+5లక్షలు, సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి ఐదు లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం
అర్హతలు:-
•ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవాలి.
•లబ్దిదారులను ఆహార భద్రత కార్డు ఆధారంగా గుర్తిస్తారు.
•లబ్ధిదారుడు బిపిఎల్ కు దిగువన ఉండాలి.
•లబ్ధిదారులు గ్రామం లేదా మున్సిపల్ పరిధిలో నివాసి
•గుడిసె, పైకప్పు ఉన్న ఇల్లు, మట్టి గోడలతో తాత్కాలిక ఇల్లు ఉన్నవారు కూడా దీనికి అర్హులు..
•అద్దె ఇళ్ళల్లో నివసిస్తున్న వారు కూడా
•వివాహమై ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నప్పటికి
ఇండ్లు మంజూరు చేయు విధానం:
•మహిళల పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరు
•జిల్లా ఇన్చార్జ్ మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇండ్ల మంజూరు
•గ్రామ, వార్డు సభలలో ఆమోదం పొందిన తర్వాత కలెక్టర్ ఎంపిక
•గ్రామ,వార్డు సభలలో లబ్ధిదారుల జాబితా ప్రకటన
నాలుగు దశలలో సబ్సిడీ:-
•బేస్మెంట్ స్థాయి – రూ.1 లక్ష
•పై కప్పు స్థాయి – రూ.1 లక్ష
•పై కప్పు నిర్మాణం తర్వాత – రూ.2 లక్షలు
•నిర్మాణం పూర్తయిన తర్వాత – రూ.1 లక్ష
ప్రభుత్వం ఏటా 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం లక్ష్యం –
• ఒక్కో నియోజకవర్గానికి- 3500
•119* 3500
•ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ – రూ.22,500 కోట్లు.
•బడ్జెట్లో అభయహస్తం కు కేటాయింపులు – రూ.53196 కోట్లు ఇలాంటి బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ త్వరగా జాయిన్ అవ్వండి.