Anganwadi Teacher, Helper Jobs | Latest Government Jobs Kadapa district Anganwadi Jobs

కడప జిల్లా యందు దిగువ తెలుపబడిన వివిధ ఐ.సి.డి.యస్ . ప్రాజెక్టుల యందు ఖాళీగా యున్నటువంటి జతపరుచబడిన జాబితాల యందు తెలుపబడిన అంగన్వాడి కార్యకర్త (50) . సహాయకురాలు (225) , మరియు మినీ అంగన్వాడి కార్యకర్త (13) పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును . 

ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1. 01.07.2021 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.

2. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

3. అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10 వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.

4. అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7 వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7 వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

5. యస్.సి. / యస్.టి . హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల ( మెయిన్ / మినీ ) యందు కేవలం యస్.సి. / యస్.టి . అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.

6. నోటిఫై చేయబడిన యస్.సి. / యస్.టి . అంగన్వాడి కేంద్రములకు యస్.సి. / యస్.టి . అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును . మరియు నోటిఫై చేయబడిన యస్.సి. యస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం . లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు , 18 సం . వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)

7. పై పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఐ.సి.డి.యస్ . ప్రాజెక్ట్ ఒక యూనిట్ గా రూల్ అఫ్ రిజర్వేషన్ పద్ధతిన ఎంపిక చేయబడుట జరుగును.

8. పై పోస్టుల భర్తీ దిగువ తెలుపబడిన పారామీటర్ల ప్రకారము భర్తీ చేయబడును.

9. కావున అభ్యర్థులు పై 1 నుండి 5 వరకు తెలుపబడిన పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు నమూనా యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును.

10. తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారము రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.

11. ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తీనకు సంబందించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును. ఈ పోస్టుల నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును . దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను అటెస్టేషన్ తో వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్ . ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును . దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది :: 31/08/2021 ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యకులు , మరియు పథక సంచాలకులు , జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ , కడప వారికి సర్వ హక్కులు కలవు.

పూర్తి వివరములకు సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయములను సంప్రదించగలరు. సం/- జిల్లా సంక్షేమాధికారి/ కన్వీనర్ మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, కడప జిల్లా.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

✅️Notification PDF Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page