Library Jobs : 12th అర్హతతో గ్రంథాలయ శాస్త్ర శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
Free AP Library CLISC Course All Details In Telugu : నిరుద్యోగ భృతి లకు శుభవార్త… గ్రంధాలయ శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CLISC) 2026 జూన్ నుంచి నిర్వహిస్తున్నట్లు విజయవాడలో పాతూరి నాగభూషణ గ్రంథాలయ శిక్షణ ఆలయం ప్రిన్సిపాల్ వారి సరదా గారు ఒక ప్రకటన చేశారు. ఈ కోర్సు 18 సంవత్సరాల నుండి ఇంటర్ ఉత్తినత అయిన వారు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. ఐదు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలుగు ఆంగ్లం మధ్యలో తరగతులు బోధిస్తామని తెలిపారు.
ఇంటర్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తామని తెలియజేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 29 లోపల దరఖాస్తు అందచేయాలని కోరుకుంటున్నారు. అప్లికేషన్ తో పాటు ఇతర పూర్తి వివరాల కోసం 7995313148, 9290670671 అనే నెంబర్ ని సంప్రదించాలని తెలియజేశారు.

విద్యా అర్హత : విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణతల అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కోర్సు పేరు : సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (CLISC)
శిక్షణ సమయం ఐదు నెలల పాటు శిక్షణ ఉంటుంది అని తెలియజేశారు.
అప్లై చేయడానికి చివరి తేదీ : 29 ఏప్రిల్ 2026 లోపు అప్లై చేసుకోవాలి.
శిక్షణ ప్రదేశం : విజయవాడలోని పాతూరి నాగభూషణం గ్రంథాలయం
పూర్తి వివరాల : 7995313148, 9290670671 నెంబర్లను సంప్రదించగలరని సూచిస్తున్నారు.


