AP 10th Class Exam Results 2026 Release Date : 6 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం… ఫలితాలు ఎప్పుడంటే?
AP 10th Class Exam Results 2026 Evaluation & Release Date All Details In Telugu : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు మార్చి 16న ప్రారంభమై 02 ఏప్రిల్ ప్రశాంతంగా ముగించాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల ఆరవ తేదీ నుంచి ప్రారంభమై ఈనెల 15వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వ పరీక్ష విభాగ సంచాలకులు శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో మూల్యాంకనం కోసం కేంద్రాలు ఏర్పరిచారు. రెగ్యులర్ పద్ధతిలో విద్యార్థులు 6,22,152 ప్రైవేటు పద్ధతిలో విద్యార్థులు 19,568 మంది పరీక్షలు రాశారు. సరాసరి ఈ సంవత్సరం 99.05% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం ఈనెల ఆరు మార్చి నుంచి ప్రారంభం చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్ష విభాగ సంచాలక శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ కోసం రోజుకి 40 జవాబు పత్రాలను ఇస్తున్నారు. ఇందులో ఉదయం 20 మధ్యాహ్నం నుంచి 20 జవాబు పత్రాలు మూల్యంకరణకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఎటువంటి తప్పులు దొరలకుండా మ్యానువల్ తో పాటు మార్క్స్ నమోదు కోసం టాబులను కూడా యూస్ చేస్తున్నారు. గత సంవత్సరం మార్క్స్ లెక్కింపులో పొరపాట్లు జరిగాయి అలా జరగకుండా ఈ సంవత్సరం టాబ్ లను తీసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదల ఏ అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా ఏప్రిల్ 23వ తేదీన పదవ తరగతి ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు అధికార వెబ్సైట్ ను results.bsc.ap gov.in సంప్రదించండి.


