ICDS Anganwadi Job Recruitment 2026 : కేవలం 10వ తరగతి అర్హతతో గ్రామ సచివాలయంలో అంగన్వాడి జాబ్స్..వెంటనే అప్లై చేసుకోండి
Latest ICDS Anganwadi Teacher Helper District Wise Job Notification 2026 Last Date : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వై.యస్.ఆర్. కడప జిల్లాలోని ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము లో అంగన్వాడీ కార్యకర్త & అంగన్వాడి సహాయాకురాలు ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీ వరకు అఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు – ఖాళీలు
•అంగన్వాడీ కార్యకర్త : 30
•అంగన్వాడి సహాయాకురాలు : 141 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
మొత్తం ఖాళీల సంఖ్య
అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి, అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం.లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును.
వేతనం: నెలకు అంగన్వాడీ టీచర్ కు రూ.11,5000/- మరియు అంగన్వాడి సహాయాకురాలు కు రూ. 7,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం, వయస్సు, సాధించిన మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును. అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. అదేవిధముగా మునిసిపాలిటీ పరిదిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.
•దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
•చిరునామా: దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ పూర్తి అప్లికేషన్, పదో తరగతి మార్క్ షీట్, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కులదొవీకరణ పత్రం, అనాధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం, వికలాంగుల అయితే వికలాంగుల ధ్రువీకరణ పత్రం & తాజాగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు 13/04/ 2026 సాయంత్రము 5:00 గంటల లోపు సమర్పించి తగు రశీదు పొందవలయును.
దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

