AP Collector Office Recruitment 2026 : 5th, 7th, 12th, Any డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు.. ఉద్యోగం వస్తుంది వెంటనే అప్లై చేయండి జాబ్ కొట్టండి
AP Collector Office Recruitment 2026 check all details and apply here : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. కలెక్టరు వారి కార్యాలయము విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) కొరకు గ్రూప్-4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్-డి. ఈ.ఓ, టెక్నికల్ విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ -III మరియు నాల్గవ తరగతి సర్వీసు నందు అటెండర్, ఆఫీసు సబార్డినేటు, కాపలాదారు, పి. హెచ్ వర్కర్, కామాటి, కుక్ మరియు ధోబి/ వాషర్ మాస్/ఉమెన్, మొదలయిన ఉద్యోగముల నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
కావున అభ్యర్ధులు మొదటి తేది 26-03-2026 మరియు చివరి తేదీ 15-04-2026 సాయంత్రం 05:00 గంటల లోగా ధరఖాస్తు ను పూరించి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2026
• దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్ 15
• కార్యాలయం ఫోన్ నెంబర్ : 08O1-2329581
ఖాళీ వివరాలు
ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాలలో 29 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్-టైపిస్ట్-డి. ఈ.ఓ, టెక్నికల్ విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ -III మరియు నాల్గవ తరగతి సర్వీసు నందు అటెండర్, ఆఫీసు సబార్డినేటు, కాపలాదారు, పి. హెచ్ వర్కర్, కామాటి, కుక్ మరియు ధోబి/ వాషర్ మాస్/ఉమెన్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
కనీస విద్యార్హతలు :
5వ, 7వ తరగతి ఉత్తీర్ణులై అయివుండాలి మరియు చదవటం రాయడం తెలిసిఉండాలి. భారతదేశ ప్రభుత్వముచే గుర్తించబడిన ఏదైనా విశ్వ విద్యాలయము నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను మరియు కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానము కలిగి ఉండాలి.


వయోపరిమితి:
ధరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి కనీస వయస్సు తేది:-01.07.2026 నాటికి 18+ సంవత్సరములు నిండి ఉండవలెను, అలాగే గరిష్ట వయసు 52 (42+10) సంవత్సరములు దాటి ఉండరాదు.
ఎంపిక ప్రక్రియ
ఏ పోస్ట్ నకు ఎంపికైన అభ్యర్థి అయిన అట్టి ఉద్యోగమునకు సంబంధించిన విధులు తానే ఖచ్చితముగా నిర్వర్తించవలసి ఉంటుంది. విధి నిర్వహణలో వైకల్యం కారణము చూపి విధులు నిర్వహించలేను అనరాదు. ఎంపిక ప్రక్రియ రోజే అభ్యర్ధి అట్టి ధృవీకరణ పత్రము కమిటీ వారికి అందచేయాలి. ఏ కారణం చేతనైన ప్రకటించిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టులోని తర్వాత అభ్యర్థిని పరిగణలోకి తీసుకోబడుతుంది. అర్హత లేని మరియు అసంపూర్తి ధరఖాస్తులపై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు చేయబడవు.
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మెరకు ఎంపిక ప్రక్రియలో భాగముగా, అభ్యర్ధుల వయస్సు: 20 మార్కులు, వికలాంగత్వ శాతం: 20 మార్కులు, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ: 10 మార్కులు చొప్పున వెయిట్ ఏజ్ ఇవ్వ బడును, పై మూడింటి మొత్తం 50 మార్కులకు గాను మెరిట్ కనబరిచిన అభ్యర్థికి నియామకాలు చేయబడుతాయి. కనీస విద్యార్హత ను ప్రామాణికముగా మాత్రమే పరిగణించబడును.
ఎలా దరఖాస్తు చేయాలి
కావున అభ్యర్ధులు మొదటి: తేది 26-03-2026 మరియు చివరి తేదీ: 15-04-2026 సాయంత్రం 05:00 గంటల లోగా ధరఖాస్తు ను పూరించి తగు పత్రములు జతపరిచి ఆ యొక్క ధరఖాస్తు ప్రతిని అదే తేదీ లోపల నెల్లూరు నగరం, కొండయపాలెం రోడ్, వనంతోపు లో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయములో సమర్పించాలని ఏదైనా సందేహ నివృత్తి కొరకు కార్యాలయ ఫోన్ నెంబర్ 0861-2329581 ను పని వేళలలో మరియు పని దినములలో సంప్రదించగలరని తెలియజేయడమైనది.
1. ఉన్న సదరం వైద్య దృవీకరణ పత్రము
2. విద్యార్హత ధ్రువీకరణ పత్రములు
3. ఎంప్లాయిమెంట్ కార్డు
4. 4వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్
5. స్థిర నివాస ధ్రువీకరణ పత్రములు
6. పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు 2 ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి పూర్తి చేసిన ధరఖాస్తును, తేది: 15-04-2026 సాయంత్రం 05.00 గంటల లోగా స్వయంగా కాని (లేదా) ప్రతినిధి ద్వారా (లేదా), పోస్టల్ ద్వారా కాని ధరఖాస్తును సమర్పించగలరు. పోస్టల్ వారి జాప్యముకు ఈ కార్యాలయము బాద్యత వహించదు.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

