మండల రెవెన్యూ అధికారి (MRO)… నెల జీతం ఎంతో తెలుసా? అర్హతలు మరిన్ని వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మండల రెవెన్యూ అధికారి (MRO)… నెల జీతం ఎంతో తెలుసా? అర్హతలు మరిన్ని వివరాలు

MRO Eligibility, Salary Job profile All Details In Telugu : ప్రస్తుత కాలంలో మండల రెవెన్యూ అధికారి (MRO) లేదా తాసిల్దార్ పిలవబడుతారు. రాష్ట్రప్రభుత్వం పరిపాలన లో MRO మండల స్థాయిలలో అత్యధిక కీలక పాత్ర ఉంటుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ పాలనల అమలు చేయబడే పథకాలు, రెవిన్యూ సంబంధించిన సమస్యలు లో ప్రధాన పాత్ర MRO వహిస్తారు. ఈ ఉద్యోగం గ్రూప్ 2 ద్వారా సెలక్షన్ చేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. APPSC ద్వారా ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

MRO అంటే ఏంటి? పని ఏముంటుంది

మండల రెవెన్యూ అధికారి (MRO) మండల స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల అమలు చేస్తారు. ప్రజల సమస్యలను, భూమి సమస్యలను పరిష్కారం చూపిస్తారు. గ్రామీణ పరిపాలనలో వీరిపాత్ర అత్యధికంగా ఉంటుంది.

MRO జీతం అండ్ అల్వెన్సెస్

మండల రెవెన్యూ అధికారి (MRO) జీతం రాష్ట్ర ప్రభుత్వ పే రిజర్వు కమిషన్ (PRC) ఆధారంగా నెల జీతం ఇస్తారు.

•BASIC PAY ₹44,570/- to ₹51,330/- starting salary ఉంటుంది.
•DA (40-50%)
•HRA (ఇంటి అద్దె) : 8-24% సిటీని ఆధారపడి ఉంటుంది.
•ట్రావెలింగ్ అలవెన్స్ మెడికల్ ఇతర అన్ని అలవెన్సెస్ కలిపి స్టార్టింగ్ శాలరీ ₹75 వేల పైన ఉంటుంది. సీనియారిటీ తో ₹1లక్ష రూపాయల పైగా నెల జీతం అందుతుంది.

అదనంగా ప్రభుత్వ అధికారిక వాహనం కొన్ని ప్రాంతాలకు మాత్రమే, స్టాప్ సపోర్ట్, ప్రభుత్వ నివాసం వంటివి కూడా లభిస్తాయి.

MRO ప్రధాన విధులు మరియు బాధ్యతలు

రెవిన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూమి రికార్డులు (ROR), సర్వేయర్లు పట్టాదారుల పాస్బుక్ జారీ, ల్యాండ్ రెవెన్యూ వసూలు, ప్రభుత్వ భూముల రక్షణ & ప్రకృతి వితంతువుల సమయంలో పనుల రాయితీ వంటివి రెవెన్యూ విధులలో ఉంటాయి.

పరిపాలన విధులలో రేషన్ కార్డ్, పెన్షన్, రైతు భరోసా అమలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రం జారీ, జనన మరణాల రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ, ఎన్నికల డ్యూటీలు గ్రామసభల ప్రజా ఫిర్యాదుల పరిష్కారాలు వంటివి పరిపాలన విధులు కిందికి వస్తాయి.

న్యాయపరమైన విధులు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటింగ్ వ్యవహారాలు, అక్రమ భూమి నివారణ, శాంతి భద్రత నిర్వహణలో పోలీసులకు సహకారం & అనుమానస్పద మరణాలపై విచారణ వంటివి న్యాయపరమైన అధికారి కిందికి వస్తాయి.

ప్రకృతి విపత్తు సమయంలో వరదలు, తుఫాను, కరువు వంటి పరిస్థితులలో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు, బాధితులకు తక్షణమే సహాయం, నష్ట అంచనా వేయడం ప్రభుత్వానికి తెలియజేయడం వంటి వ్యవహారాలు చేస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *