AP SSC Exams 2026 : ఏపీ 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
AP 10th Class Exams 2026 Important instructions for AP 10th class students: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. పరీక్షలకు రంగం పూర్తిగా సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరి కోసం 3415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు సానుకూలంగా జరగాలని పలుమార్పులు చేశారు. అందులో ముఖ్యంగా హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్, ఉచిత బస్సు ప్రయాణము అలాగే నిమిషం నిబంధన సడలింపు వంటివి మార్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హాజరై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్త పాటించవలసి అవసరం ఉంది. అప్పుడే పరీక్షలు ఇలాంటి ఒత్తిడి లేకుండా విజయవంతంగా రాయడానికి విద్యార్థులకు వీలుగా ఉంటుంది.

విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతాయి. విద్యార్థులను ఉదయం 8:30 నుంచి పరీక్షా కేంద్ర ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు నిమిష నిబంధనలు కూడా సవరించారు. ప్రత్యేక పరిస్థితులలో పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా విద్యార్థులకు అనుమతిస్తామని అధికారికంగా స్పష్టం చేశారు. పెన్నులు, పెన్సిల్లు, ఏరేజర్, షార్పనర్ & హాల్ టికెట్ తో ఒక పోచ్ లో ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. విద్యార్థులకు టైం టేబుల్ లో ఒక పరీక్షకి మరొక పరీక్షకి టైం ఉండే విధంగా కూడా టైం టేబుల్ రూపొందించారు.
విద్యార్థులకు పట్టణ మరియు నగర ప్రాంతాలలో విద్యార్థుల పరీక్ష కేంద్రాలు గుర్తించడానికి ఈ సంవత్సరం క్యూఆర్ కోడ్ రూపొందించారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ లో స్కాన్ చేసి గూగుల్ మ్యాప్ సహాయంతో సులువుగా సెంటర్ ను చేరుకోవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు తమ హాల్ టికెట్ ను చూపించి ఆర్టీసీ బస్సులో పరీక్షా కేంద్రానికి ఉచితంగా ఇంటి నుంచి ప్రయాణించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.
ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష నిర్వహణతో పాటు జవాబు పత్రాల మూల్యకరణ కూడా అధికారికంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూల్యాంకట ప్రక్రియ కూడా సాగుతుంది. ఇందుకుగాను 26 జిల్లాలలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకనగా ఈ సంవత్సరంలో లెక్కింపులో పొరపాట్లు తవ్వనీకుండా ఉండేటట్టు, టాబ్లెట్లు మార్కులు నమోదు చేసి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మూల్యంకరణలో ఒక రోజుకి ఉపాధ్యాయులకు 40 జవాబు పత్రాలు మాత్రమే మూలికరణ చేసే నిబంధనలు విధిస్తున్నారు. అలా చేయడం వల్ల ఎటువంటి తప్పు చేయకుండా మూల్యంకరణ సులువుగా అవుతుంది. పని భారం కూడా తగ్గుతుంది. జవాబు పత్రాల మూల్యాంకర్ణులు ఎటువంటి తప్పులు జరగకుండా సులువుగా మూల్యంకరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

🛑AP 10th Class hall ticket direct link Click Here

