India Post GDS 2026 Results 2nd merit list date | India Post GDS document verification start check required documents last date
India Post GDS 2nd merit list date | postal GDS 2026 verification start cheque required document and last date : ఇండియా పోస్ట్ GDS షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం 2026 ప్రారంభమైంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ మరియు స్వయం ధ్రువీకరింపబడిన కాపీ తో వారి కేటాయించబడిన డివిజన్ కార్యాలయంలో హాజరు కావాలి. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేదీ 23 మర్చి 2026 లోపు పోస్టల్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
గ్రామీణ డాగ్ సేవక్ నియామకాలలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వెంటనే ఇండియన్ పోస్టల్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ 2026 కొనసాగుతుంది. మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు తమకు కేటాయించిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన వెరిఫికేషన్ సెంటర్కు రిపోర్ట్ చేసి ఇచ్చిన టైం టేబుల్ లోపున డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి అధికారికి నోటిఫికేషన్ ప్రకారము డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 23 మార్చి 2026 చివరి తేదీ మరిన్ని వివరాలు కింద చూద్దాం. 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుందనేది కూడా ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది.

ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాలు 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ 6 మార్చి 2026న షార్ట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు షార్ట్లిట్లో ఇచ్చిన డివిజన్ కార్యాలయంలో వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి. వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ తో టు సెట్ ధ్రువీకరణ ఫోటో కాపీలు కూడా తీసుకెళ్లాలి. వాళ్ళు ఇచ్చిన గడువు తేదీ కన్నా ముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. గడువు 23 మర్చి 2026 లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2026 లో ముఖ్యమైన వివరాలు
•సంస్థ : ఇండియా పోస్ట్
•పోస్ట్ పేరు : గ్రామీణ టాక్ సేవక్ (GDS)
•నియామకంసంవత్సరం :: ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026
•పోస్ట్ వివరాలు : బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాగ్ సేవక్
•మొత్తం పోస్టులు :: 28,636
•ఫలితాల విధానం : ఆన్లైన్
•1st మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 06 మర్చి 2026
•2nd మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 04 ఏప్రిల్ 2026 అంచనా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ : 23 మర్చి 2026
•ఎంపిక ప్రక్రియ : డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
•అధికార వెబ్సైట్ : https://www.indiapost.gov.in/gdsonlineengagement
ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2026కి అవసరమైన పత్రాలు వివరాలు
1.10వ తరగతి మార్కులు మార్క్ షీట్ – విద్య అర్హత మరియు పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఉపయోగపడుతుంది.
2.గుర్తింపు కార్డు – ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్ పోర్ట్ వంటివి.
3.కుల ధ్రువీకరణ పత్రం – SC, ST, OBC అభ్యర్థుల అయితే తప్పనిసరిగా కుల దృవీకరణ పత్రం ఉండాలి.
4.EWS సర్టిఫికెట్ – EWS రిజర్వేషన్ వర్తిస్తే అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ పెట్టాలి.
5.PWD సర్టిఫికెట్ – వైకల్య ధ్రువీకరణ పత్రం మెడికల్ ఆఫీసర్ నుంచి తీసుకొని ఉండాలి.
6. నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పెట్టాలి.
7. కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తులు పేర్కొన్న విధంగా తప్పనిసరిగా తీసుకుపోవాలి.
8. GDS దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి.
ఇండియా పోస్ట్ GDS డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ముఖ్యమైన సూచనలు
• అభ్యర్థులు అన్నీ ఒరిజినల్స్ డాక్యుమెంట్ తో పాటు 2 సెట్ ఫోటో కాపీ తీసుకుపోవాలి.
•23 మర్చి 2026 లోపే ధ్రువీకరణ కేంద్రానికి చేరుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
•కొత్తగా తీసుకున్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా చేసుకోవాలి.
• 23 మార్చ్ 2026 నాటికి ధ్రువీకరణ పూర్తి చేయకపోతే అభ్యర్థులకు ఫస్ట్ మెరిట్ లిస్టులో ఉన్న రద్దు చేయడం జరుగుతుంది.
ఇండియా పోస్ట్ GDS ఉద్యోగులకు డాకుమెంట్ వెరిఫికేషన్ చివరి తేదీ ఎప్పుడు?
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పూర్తి చేయడానికి చివరి తేదీ 23 మర్చి 2026 లోపు చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు
1st మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 23 మర్చి 2026 నాటికీ చివరి తేదీ ముగిస్తుంది. ఆ లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోపోతే ఆ లిస్టులో ఉన్న పేర్లు అన్ని రద్దుచేసి.. మార్చి లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో 2nd మెరిట్ లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉంది. పోస్టల్ GDS 2nd మెరిట్ లిస్ట్ అంచనా ప్రకారం 04 ఏప్రిల్ 2026 విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇండియా పోస్ట్ GDS 2nd మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేయడం?
•అభ్యర్థి ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ ని విజిట్ చేయండి.
• అందులో హోమ్ పేజీలో లెఫ్ట్ సైడ్ లో కింద Shortlisted Candidates: Schedule-1, January-2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
• తరువాత స్టేట్ వస్తుంది స్టేట్ సెలెక్ట్ చేయండి. అందులో List of shortlisted candidates ఆప్షన్ కింద 2nd మెరిట్ లిస్ట్ ఆప్షన్ వస్తుంది.. దాని పైన క్లిక్ చేస్తే మీకు 2nd మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది.
• 2nd మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 4న విడుదల అయ్యే అవకాశం ఉంది.


