AP KGBV Admissions 2026 : ఎంట్రన్స్ పరీక్ష లేకుండా 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP KGBV Admissions 2026 : ఎంట్రన్స్ పరీక్ష లేకుండా 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం..

AP KGBV Admissions 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో (KGBV) లో 2026-27 సంవత్సరానికి సంబంధించి మార్చ్ 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అధికారికంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు కేజీబీవీల ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2026-27 సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశం కోసం మార్చి 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ఏడ తరగతి ఖాళీల సీట్లు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ముగింపు 01 ఏప్రిల్ 2026 తేదీ వరకు ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు అనాధ పిల్లలు, స్కూల్ డ్రాప్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ తెలియజేస్తున్నారు.

ఈ అడ్మిషన్ కోసం ఎటువంటి ఎంట్రన్స్ పరీక్ష అవసరం లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో వెళ్లేసి అప్లికేషన్ చేసుకోండి. తర్వాత ఏప్రిల్ 13వ తేదీన మీకు ఫస్ట్ జాబితా విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ 17 లోపు ఆయా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా విద్యార్థులకు రిజర్వేషన్ మరియు సర్టిఫికెట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి & నివాస సౌకర్యం కల్పిస్తారు.

అర్హతలు : కింద ఇచ్చిన వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

•అనాధ బాలికలు
•బడి బయట ఉన్న పిల్లలు
•చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు
• పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు
• ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు
•బీపీల్ ఉన్న కుటుంబ విద్యార్థులు.

కేజీబీవీ అడ్మిషన్లు ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 12 మర్చి 2026
• దరఖాస్తు చివరి తేదీ : 01 ఏప్రిల్ 2026
• మెరిట్ జాబితా విడుదల తేదీ : 13 ఏప్రిల్ 2026
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 13-17 ఏప్రిల్ 2026

🛑 Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *