Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now
RRB NTPC Under Graduate Level Recruitment 2025 Latest Railway Ticket Collector Job Notification Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) NTPC నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్ల క్లర్క్ పోస్టులకు నియామకాలు కోసంఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 28.10.2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 27.11.2025 (రాత్రి 3:59 గంటలు) లోపు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) వివిధ పోస్టులకు నియామకాలు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3058 పోస్టులు ఉన్నాయి. 27 నవంబర్ 2025 నాటికీ వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మీరు సెలెక్ట్ అయితే సొంత జిల్లా రైల్వే స్టేషన్ లో ఉద్యోగంలో ఉంటారు. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ 27.11.2025 (రాత్రి 3:59 గంటలు) లోపు https://www.rrbapply.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply 3058 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (అండర్ గ్రాడ్యుయేట్) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్ల క్లర్క్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు
దరఖాస్తు ప్రారంభం :: 28 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు:
•కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ = 2424
•అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ =394
•జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ = 163
•రైళ్ల క్లర్క్ = 77 – 3058 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»అర్హత:
•కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ :: మొత్తం మీద 50% కంటే తక్కువ కాకుండా 12వ తరగతి (+2 దశ) లేదా దానికి సమానమైన అర్హత. SC/ST/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు/మాజీ సైనికులు మరియు 12వ తరగతి (+2 దశ) కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల విషయంలో 50% మార్కులు పొందాలని పట్టుబట్టకూడదు.
•అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ :: మొత్తం మీద 50% కంటే తక్కువ మార్కులతో 12వ తరగతి (+2 దశ) లేదా దానికి సమానమైనది. SC/ST/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు/మాజీ సైనికులు మరియు 12వ తరగతి (+2 దశ) కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల విషయంలో 50% మార్కులు పొందాలని పట్టుబట్టకూడదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్/హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
•జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ :: 12వ తరగతి (+2 స్టేజ్) లేదా దానికి సమానమైన అర్హత మొత్తం 50% కంటే తక్కువ కాదు. SC/ST/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు/మాజీ సైనికులు మరియు 12వ తరగతి (+2 స్టేజ్) కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల విషయంలో 50% మార్కులు తప్పనిసరి కాదు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ / హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
•రైళ్ల క్లర్క్ :: మొత్తం మీద 50% కంటే తక్కువ కాకుండా 12వ తరగతి (+2 దశ) లేదా దానికి సమానమైన అర్హత. SC/ST/బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు/మాజీ సైనికులు మరియు 12వ తరగతి (+2 దశ) కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థుల విషయంలో 50% మార్కులు పొందాలని పట్టుబట్టకూడదు.

»వయోపరిమితి: 01.01.2026 నాటికి తక్కువ వయోపరిమితి 18-30 సంవత్సరాలకు మించకూడదు. SC, ST సభ్యులకు 5 సంవత్సరాలు మరియు ఇతర OBC 3 సంవత్సరాలు సడలింపు ఉటుంది.

»వేతనం: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు రూ.21700-రూ.69100/- మరియు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & రైళ్ల క్లర్క్ పోస్టులనుసరించి నెలకు జీతం రూ.19,900-రూ. 63,200/- జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC/ ST/ PwBD/ మహిళలు/ మాజీ సైనికులు అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు రూ.250/- మిగిలిన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.

»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBTలు), కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తేదీలను సంబంధిత RRBల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి https://www.rrbapply.gov.in/ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 27.11.2025 తేదీ 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 28-10-2025.
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 27-11-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

