Ayah Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Outreach worker in DCPU Ayah Recruitment 2025 Apply Now
AP WDCW Outreach worker in DCPU and Ayah Recruitment 2025 Latest Ayah Jobs Notification Apply Now : హలో ఫ్రెండ్స్.. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో బాలల పరిరక్షణ విభాగంలో (DCPU) అవుట్ రీచ్ వర్కర్ & ప్రత్యేక దత్తత సంస్థ (శివ) గృహ) లో ఆయా కాంట్రాక్టు పద్ధతిన భర్తీ ఉద్యోగాల కోసం 27 అక్టోబర్ 2025 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.
ఆంధ్ర ప్రదేశ్ ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆదరగా సెలక్షన్ ఉంటుంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, వై.యస్.ఆర్. కడప జిల్లా యందలి జిల్లా బాలల పరిరక్షణ విభాగము మరియు ప్రత్యేక దత్తత సంస్థ (శిశు గృహ), యందు ఖాళీగా యున్నటువంటి క్రింద తెలుపబడిన వివిద పోస్టులకు క్రింద ఇవ్వబడిన అర్హతల ప్రకారము కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అర్హత వయస్సు 25 సం.ల నుండి 42 సం.ల వరకు మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ నియామకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి పెర్ఫార్మన్స్ ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును.

AP WDCW Outreach worker in DCPU and Ayah నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము మరియు ప్రత్యేక దత్తత సంస్థ (శిశు గృహ) యందు నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: అవుట్ రీచ్ వర్కర్ & ఆయా పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 25-42 సంవత్సరాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 02
అర్హత :: 10th, 12వ తరగతి ఉత్తీర్ణత పాస్ అయితే చాలు
నెల జీతం :: రూ.₹7,944/- ₹10,592/-ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 14 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://kadapa.ap.gov.in
»పోస్టుల వివరాలు: అవుట్ రీచ్ వర్కర్ & ఆయా ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 02 ఉన్నాయి.

»అర్హత:
•అవుట్ రీచ్ వర్కర్ : గుర్తింపు పొందిన బోర్డు/తత్సమానం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. బోర్డు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగ అనుభవం అభ్యర్థికి వెయిటేజీ.
•ఆయా : శిశువులను జాగ్రత్తగా చూసుకోవడంలో 5 అనుభవం ఉండాలి. ఉద్యోగ బాధ్యతలు: శిశుగృహ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, గదులు, పరిసరాలు, పిల్లల ఆట వస్తువులు మరియు ఊయలలను శుభ్రంగా ఉంచడం, పిల్లలకు సరైన సమయంలో ఆహారం అందించడం వంటివి చేయాలి. వారు షిఫ్ట్ పద్ధతిలో పని చేయాలి. రాత్రి బస కూడా తప్పనిసరి.


»వయోపరిమితి: గరిష్ట వయస్సు 27/10/2025 నాటికి కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు SC/ST/OBC & PH వర్గాలకు గోల్ రూల్స్ ప్రకారం సడలింపుతో ఉటుంది.
»వేతనం: పోస్టుకు అనుసరించి రూ.₹7,944/- ₹10,592/- pm మధ్య నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్లు దరఖాస్తు ఫీజు లేదు.
»ఎంపిక విధానం: అర్హతా ప్రమాణాలననుసరించి కుదించబడిన జాబితాలోని అభ్యర్థులను మాత్రమే ఎంపిక ఇంటర్వ్యూనకు పిలువబడుదురు. మరియు నియామకములు జరుపు తేదీ నాటికి అమలులో యున్న / జారీ చేయబడు నిబంధనల ప్రకారము ఈ నియామకములు జరుగును.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.inవెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత దృవీకరణ పత్రములు జతపరచి 27-10-25 వ తేది సాయంత్రం 05.00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్. జిల్లా యందు సమర్పించవలయును.
ఎటువంటి కారణములు తెలియబరుచకనే ఈ ప్రకటన రద్దు పరచుటకు లేదా వాయిదా వేయుటకు లేదా మార్పులు చేయుటకు దిగువ సంతకముదారు వారికి పూర్తి అధికారములు కలవు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 14.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 27.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here