BEL Recruitment 2025 : విద్యుత్ సబ్ స్టేషన్లలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Central Government Jobs In Telugu
BEL Recruitment 2025 Latest Engineering Assistant Trainee & Technician C Notification Apply Now : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) (రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ) లో కోసం శాశ్వత ప్రాతిపదికన ఇంజనీరింగ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ “సి” కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29 అక్టోబర్ 2025 వరకు ఆన్లైన్లో www.bel-india.in అప్లై చేసుకోవాలి.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ “సి” లో ఉద్యోగముల నియామకము కొరకు అక్టోబర్ 08 నుంచి అప్లికేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. గరిష్ట వయోపరిమితి (01.10.2025 నాటికి) 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. స్కేల్: రూ.24,500-3%-రూ.90,000/+ అనుమతించదగిన అలవెన్సులు. BEL కంపెనీ వాళ్లు ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు.

BELనోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: ఇంజనీరింగ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ “సి” పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18-28 సంవత్సరాలు
మొత్తం పోస్ట్ :: 30
అర్హత :: 10th+ ITI & ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయితే చాలు
నెల జీతం :: రూ.రూ.24,500-3%-రూ.90,000/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 08 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 29 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: www.bel-india.in
»పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్ & టెక్నీషియన్ “సి” ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 30 ఉన్నాయి.
»అర్హత:
•ఇంజనీరింగ్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా.
•టెక్నీషియన్ “సి” : సంబంధిత ట్రేడ్‌లో SSLCITI+ఒక సంవత్సరం నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కోర్సు.

»వయోపరిమితి: వయస్సు ప్రమాణాలు (01.10.2025 నాటికి) ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) : 28 సంవత్సరాలు & టెక్నీషియన్ ‘సి’ : 28 సంవత్సరాలు మించకూడదు. ) జనరల్/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు, 01.10.2025 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి (ఎన్‌సిఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

»వేతనం: పోస్టుకు అనుసరించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) : రూ.24,500-3%-రూ.90,000/- & టెక్నీషియన్ ‘సి’ రూ.21,500/-3%-రూ.82,000/+ అనుమతించదగిన అలవెన్సులు స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: GEN/OBC(NCL)/EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 500+ 18% GST అంటే రూ. 590/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
»ఎంపిక విధానం: అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న మరియు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు హైదరాబాద్‌లో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్షకు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
ఎలా దరఖాస్తు చేయాలి : పైన పేర్కొన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లింక్‌ను ఉపయోగించి దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. www.bel-india.in ఆన్‌లైన్ లింక్ BEL అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందించబడింది.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 08.10.2025.
•దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ : 29.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here