Forest Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గడువు పొడిగింపు చివరి తేదీ ఎప్పుడంటే
APPSC Forest Beat Officer Job Notification 2025 extended the last date : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా A.P. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం నోటిఫికేషన్ నెం.06/2025, తేదీ: 14/07/2025 నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో 690 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 12 క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో 80 to 330 మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 01-07-2025 నాటికీ 18 to 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 25,220 – 80,910 & ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 23,120 – 74,770 మధ్యలో నెల జీతం ఇస్తారు.

APPSC ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి కమిషన్ చివరి తేదీని 05/08/2025 నుండి 10/08/2025 వరకు పరిపాలనా ప్రాతిపదికన 11:59 (అర్ధరాత్రి) వరకు పొడిగించింది. కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.
APPSCఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడంపై ఏవైనా ఫిర్యాదుల కోసం, దరఖాస్తుదారులు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ క్రింది మెయిల్ ఐడి మరియు సంప్రదింపు నంబర్ల ద్వారా కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మెయిల్ ఐడి: appschelpdesk@gmail.com సంప్రదింపు నంబర్లు: 0866-2527820 మరియు 2527821.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here