Anganwadi Helper Jobs : పరీక్ష, ఫీజు లేకుండా కొత్తగా 10th అర్హతతో అంగన్వాడి సహాయకురాలు నోటిఫికేషన్ వచ్చేసింది
AP Anganwadi Helpers Notification 2025 All Details in Telugu : జిల్లా మహిళాభివ్రుద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో 40 అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ లకు దరఖాస్తులు అర్హులైన అభ్యర్థినుల నుండి ఆహ్వానించడమైనది. నియమ నిబంధనలకు సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారినులణుల కార్యాలయం నందు సంప్రదించగలరు.

అంగన్వాడీ సహాయకురాలు పోస్టునకు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలయును. వయస్సు 31.7.2025 నాటికి 21 సం. నిండి 35 సం.లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అంగన్వాడీ 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లోని నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. అలాగే పై నోటిఫికేషన్ ద్వారా బనగానపల్లి ప్రాజెక్ట్ పరిధులో మరియు నందికొట్కూరు ప్రాజెక్ట్ పరిధులో ప్రకటించిన మినీ అంగన్వాడి కార్యకర్తలకు సంబందించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వ ఆదేశాలనుసారం రద్దుపరచడమైనది. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు పని 23.07.2025 ఉదయం 10 గం. ల నుండి మొదలు 31.07.2025 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.
అలాగే పై నోటిఫికేషన్ ద్వారా బనగానపల్లి ప్రాజెక్ట్ పరిధులో మరియు నందికొట్కూరు ప్రాజెక్ట్ పరిధులో ప్రకటించిన మినీ అంగన్వాడి కార్యకర్తలకు సంబందించిన నోటిఫికేషన్ ను ప్రభుత్వ ఆదేశాలనుసారం రద్దుపరచడమైనది.
అంగన్వాడీ సహాయకురాలు పోస్టునకు కావాల్సిన అర్హతలు :-
1. అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
2. అభ్యర్థినులు తేదీ 31.07.2025 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు లోపు వారై ఉండవలెను
3. అభ్యర్థినులు తప్పనిసరిగా స్థానిక నివాసితురాలై & వివాహితురాలై ఉండవలెను.
4. యస్. సి. యస్ టి జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను
జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల దృవీకరణ పత్రము (SC, ST & OBC) అభ్యర్థినులు ధృవీకరణ పత్రం (లేటెస్ట్) ది జతపరచవలయును.
3. విద్యార్హత దృవీకరణ పత్రము – యస్.యస్.సి మార్క్ లిస్ట్, టి.సి, మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి.సి. జతపరచవలయును.
4. నివాస స్థల ధృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో సచో భర్త మరణ ధృవీకరణ పత్రము మరియు 18 సం. ల పిల్లలు ఉన్నచో, వారి యొక్క వయసు దృవీకరణ పత్రము,
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. ఆథారు కార్డ్ మరియు
8. రేషన్ కార్డు
దరఖాస్తు వెంట అవసరమగు ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అర్టిస్ట్రేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేదీ: 23.07.2025 నుండి తేది : 31.07.2025 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయముల పని దినములలో సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here