NTR Baby Kit : వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ బేబీ కిట్ మళ్లీ వస్తుంది
NTR Baby Kit : ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన బిడ్డకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016 జూలైనా ఎన్టీఆర్ బేబీ కిట్ ప్రవేశపెట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పథకాన్ని డాక్టర్ వైఎస్ఆర్ బేబీ కిట్టుగా పేరు మార్చి ఓ ఏడాది పాటు అందజేయడం జరిగింది. ఆ తర్వాత లేకపోవడం జరిగింది.
రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఎన్టీఆర్ బేబీ కిట్ ద్వారా 11 రకాల వస్తువులు విలువ రూ 1410 కలిగి ఉంటాయి. ఇందులో చిన్నారి దోమల తెరతో కూడిన బెడ్, వాటర్ ప్రూఫ్ కట్ స్వీట్, బేబీ సబ్బు, బేబీ డ్రెస్, పౌడర్, టవల్, napkins, Baby Oil, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్. వీటన్ని విలువ 1410 ఉంటుందని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీటి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. ప్రజలకు డెలివరీ ఖర్చు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది.