Thalliki Vandanam – తల్లికి వందనం పై సీఎం కీలక ప్రకటన
Thalliki Vandanam 2025 release date : తల్లికి వందనం పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పారని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం కింద, ఒక్కో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే, వారి తల్లికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఈ పథకం మే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి కూడా 15000 ఇస్తామని తెలియజేస్తున్నారు.
Thalliki Vandanam 2025 release date
రైతుల విషయంలో, అన్నదాతలకు కేంద్రం నుంచి వచ్చే రూ.6,000తో కలిపి మొత్తం రూ.20,000 మూడు విడతల్లో అందజేస్తామని చెప్పారు. ఇది రైతులకు మరింత ఆర్థిక స్థిరత్వం కల్పించే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఈ పథకాల అమలులో ఆ ఆర్థిక ఒడిదొడుకులు సవాళ్లుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
ఈ పథకాలు ఆచరణలో ఎంతవరకు సఫలమవుతాయి, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను ఎలా నెరవేరుస్తారనేది చూడాల్సి ఉంది.