APSRTC Jobs : 10th అర్హతతో డ్రైవర్లు, కండక్టర్లు గా 11,500 RTC లో Govt Jobs |  APSRTC Jobs Notification | Telugujobspoint

APSRTC Jobs : 10th అర్హతతో డ్రైవర్లు, కండక్టర్లు గా 11,500 RTC లో Govt Jobs |  APSRTC Jobs Notification | Telugujobspoint

APSRTC Notification : ఏపీ ఆర్టీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) త్వరలోనే భారీ 11,500 ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి చెందిన పలు విభాగాల్లో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. వీటిని భర్తీ చేసేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రతి సంవత్సరం ఏపీ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుంటారు. దీంతో, సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, ఇతర సిబ్బంది వంటి విభాగాల్లో అనేక ఖాళీలు ఏర్పడుతున్నాయి. కానీ, ఈ ఖాళీలు ఇప్పటివరకు భర్తీ చేయకపోవడం వల్ల పని భారాలు పెరిగాయని తెలుస్తోంది. ఖాళీలపై ఉన్నతాధికారుల నివేదిక ఆర్టీసీ ఉన్నతాధికారులు ఖాళీలను గుర్తించి, వీటిని భర్తీ చేయాల్సిన అవసరంపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నివేదిక ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా 11,500 ఉద్యోగాలకు అవసరం ఉంటుందని అంచనా వేశారు.

మహిళల ప్రయోజనాల కోసం ప్రణాళికలు ఏపీ ప్రభుత్వం, ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త బస్సులను నడిపేందుకు భారీ సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు అవసరమవుతారు.

ఆర్టీసీ నియామకాల్లో ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులు 10,000 వరకు ఉంటాయని అంచనా. వీటికి అదనంగా, జూనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్ వంటి పోస్టులు 1,500 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలు పొందాలనుకుంటే రాత పరీక్ష ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే మీరు బాగా చదవండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page