తెలంగాణలో మరో కొత్త పథకం : వచ్చే నెలలో ప్రతి కుటుంబానికి రూ.6,000
తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు ఏటా 12000 ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది.. దానికి సంబంధించి మొదటి విడుదల 6000 వచ్చే నెలలో ఇస్తామని తెలియజేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ధరణి కమిటీ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేనట్లు గుర్తించబడింది. వీరిలో 70 శాతం మంది దళితులు అని నివేదిక స్పష్టం చేసింది. భూమి లేని పేదలకు ఏటా రూ.12,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం తొలి విడతగా వచ్చే నెలలో ప్రతి కుటుంబానికి రూ.6,000 చొప్పున అందజేయనుంది.ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే ఆధారంగా అర్హులను గుర్తిస్తారు. అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఉపాధి హామీ కార్డులు కలిగిన భూమి లేని కుటుంబాలు అర్హులవుతారు.