ICDS Anganwadi Recruitment : 10th Class అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Anganwadi Jobs Notification 2024 In Telugu
Andhra Pradesh Anganwadi Notification 2024 in AP Last date : నిరుద్యోగ మహిళలకు శుభవార్త… 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సర్టిఫికెట్ చూసి జాబ్. జిల్లా పరిధిలోని 12 ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోపు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం పూర్తిగా స్థానిక పరిధిలోనే సొంత గ్రామం లేదా వార్డులో ఉద్యోగం ఇస్తారు. దరఖాస్తులు సంబంధిత సీడీపీఓ (Child Development Project Officer) కార్యాలయాలకు సమర్పించాలి.

ఆర్గనైజేషన్ పేరు : ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS)
ప్రాజెక్టుల సంఖ్య : 12 ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు
ఖాళీల వివరాలు
• అంగన్వాడీ టీచర్ : 15
• మినీ అంగన్వాడీ టీచర్ : 4
• అంగన్వాడీ ఆయలు : 89
• మొత్తం 108 పోస్టులు భర్తీ చేయబడతాయి.
అర్హతలు
అంగన్వాడీ పోస్టుల కోసం అభ్యర్థులు క్రింది అర్హతలను కలిగి ఉండాలి:
• అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయలు పోస్టుకు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
• అభ్యర్థి వివాహితురాలై ఉండాలి మరియు స్థానిక నివాసితురాలై ఉండాలి.
వయోపరిమితి
• కనిష్ట వయస్సు : 21 సం.
• గరిష్ట వయస్సు : 35 సం.
• గిరిజన ప్రాంతాల్లో 21 సం. వయస్సు నిండని అభ్యర్థులు అందుబాటులో లేనపుడు 18 సం. పైబడి వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• పుట్టిన తేదీ/వయస్సు నిర్ధారణ పత్రం
• విద్యార్హత సర్టిఫికేట్: SSC మార్కుల జాబితా మరియు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C).
• కుల ధృవీకరణ పత్రం: ఎస్సీ/ఎస్టీ/బీసీ కులాల కోసం సంబంధిత అధికారుల నుండి జారీ చేయబడిన ధృవపత్రం.
• నివాస ధృవీకరణ పత్రం: స్థానికత నిర్ధారణకు తప్పనిసరిగా ఈ పత్రం అవసరం.
• వితంతువు అయితే: భర్త మరణ ధృవీకరణ పత్రం మరియు పిల్లల వయస్సు నిర్ధారణ పత్రం.
• వికలాంగుల కోసం: సంబంధిత మెడికల్ బోర్డ్ నుండి జారీ చేసిన వికలాంగుల ధృవీకరణ పత్రం.
• ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు: గుర్తింపు మరియు కుటుంబ వివరాల కోసం.
గమనిక : పై చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి గ్రాజిటెడ్ అధికారించి ఆర్టిస్ట్మెంట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
అంగన్వాడీ దరఖాస్తు విధానం
• అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను నింపి, అందుకు సంబంధించిన సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలి.
• దరఖాస్తు సమర్పించే చివరి తేదీ 23వ తేదీ గా ప్రకటించబడింది.
ఎంపిక ప్రక్రియ
• ఎంపిక పూర్తిగా మెరిట్ (merit) ఆధారంగా ఉంటుంది.
• విద్యార్హతలు, వయస్సు మరియు పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జరుగుతుంది.
• ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, వితంతువులు) రిజర్వేషన్ ఆధారంగా ప్రాధాన్యత ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 11వ తేదీ
• దరఖాస్తు చివరి తేదీ: 23వ తేదీ

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
ఈ అంగన్వాడీ పోస్టులకు ఎవరెవరూ దరఖాస్తు చేయవచ్చు?
10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు మరియు స్థానిక నివాసితులు దరఖాస్తు చేయవచ్చు.
గరిష్ట వయోపరిమితి ఎంత?
35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఎలా అందజేయాలి?
సంబంధిత సీడీపీఓ కార్యాలయానికి వ్యక్తిగతంగా దరఖాస్తును సమర్పించాలి.