మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా కుట్టు మిషన్ : PM Modi free Sewing Machine full detail in Telugu
free Sewing Machine in Telugu : కేంద్రంలో బిజెపి అధికారంలో రావడం అందరికీ తెలిసిందే, ఇదివరకే అమలు చేస్తున్న పథకం free Sewing Machine చాలా మంది అప్లై చేసుకుని ఫ్రీగా పొందారు. అలాగే మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు, డాక్యుమెంట్స్ వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తుంది అదేవిధంగా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. ఒక వారం ట్రైనింగ్ ఇచ్చి ఆ వారం రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా 500 రూపాయలు మీకు చూపిస్తుంది.
కుట్టు మిషన్ ఉపయోగించడం నేర్చుకున్న తర్వాత కేంద్రం 1 లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలలు లోపు చెల్లించవలసి ఉంటుంది. రుణం చెల్లించాక మరో రెండు లక్షల దాకా మీరు రుణం తీసుకోవచ్చు. దానిని కూడా 30 నెలల లోపు చెల్లించవలసి ఉంటుంది. అలాగే కేంద్రం కుట్టుమిషన్ కొనాలనుకున్నవారు… షాపు పెట్టుకునేందుకు రుణం ఇస్తుంది. ఈ రుణానికి వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. ఈ కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకోవడానికి మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హత :- ఈ పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ నివాసులై ఉండాలి. అప్పటికే కుట్టు పని చేస్తున్న అభ్యర్థులు మాత్రమే కుట్టు మిషన్ పథకానికి అప్లై చేసుకోవాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్ గా పని చేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
కుట్టు మిషన్ పథకం కోసం డాక్యుమెంట్స్ వివరాలు :- కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకున్న వారు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్ బుక్ ఈ డాక్యుమెంట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఉచిత కుట్టు మిషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి :-
ఉచిత కుట్టుమిషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే https://pmvishwakarma.gov.in అధికార వెబ్ పేజీ వెళ్లేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని, మీ దగ్గర ఉన్నటువంటి ఈ సేవ లేదా సచివాలయాలకు వెళ్లేసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే కొన్ని రోజులు తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మీ అకౌంట్లో డైరెక్ట్ గా డబ్బులు పడడం జరుగుతుంది.