AP Grama/ Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 13995 అన్ని జిల్లాల వారికి అవకాశం

AP Grama/ Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 13995 అన్ని జిల్లాల వారికి అవకాశం

📌సచివాలయాల్లో 13,995 ఖాళీలు అత్యధికంగా పశుసంవర్థక శాఖలోనే ఖాళీలు ఉన్నాయి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌పలు శాఖల్లో ఖాళీల వివరాలు ఉన్నట్టు అంచనా ఉన్నాయి.

📌3 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఖాళీల వివరాలు పంపాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ లేఖ రాయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు అధికంగా పశుసంవర్ధక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు ఉండగా, విద్యుత్ శాఖ గ్రేడ్-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది. ఉద్యానవన సహాయకుల ఉద్యోగాలు 1,496, గ్రేడ్-3 మహిళా పోలీస్ ఉద్యోగాలు 1092, గ్రామ సర్వేయర్ సహాయకుల ఉద్యోగాలు 1,027 ఖాళీగా ఉన్నాయి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree Jobs Click Here

కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీలు..

🔷పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టులు= 4,765 పోస్టులు 

🔷ఉద్యానవన అసిస్టెంట్  = 1496 పోస్టులు

🔷ఎనర్జీ అసిస్టెంట్ =1127 పోస్టులు

🔷మహిళా పోలీస్ = 1092 పోస్టులు

🔷గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ =1027 పోస్టులు

🔷ఇంజినీరింగ్ అసిస్టెంట్ = 982 పోస్టులు

🔷పంచాయతీ అసిస్టెంట్ =731 పోస్టులు

🔷సంక్షేమ విద్య అసిస్టెంట్ =543 పోస్టులు

🔷వార్డు సౌకర్యాల అసిస్టెంట్ = 459 పోస్టులు

🔷వార్డు ప్లానింగ్ సెక్రటరీ = 436 పోస్టులు

🛑మొత్తం పోస్టులు = 13995 పోస్టులు

మొత్తం ఖాళీల్లో ఏవి అవసరమున్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదన్నదానిపైనా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకులు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇటువంటి ఖాళీలే 3905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను

పరిగణనలోకి తీసుకున్న తరువాత భర్తీ చేయాలని నిర్ణయించారు. జాబ్ చార్టు లేని పోస్టులు దాదాపు 8 కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో ఉద్యోగాలుకు ఇంకా జాబ్ చార్టు కూడా ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం – విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర్ శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్వాడీ ఉద్యోగాలు జాబ్ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Official Web Page Link Click Here   

🛑Official Web Page Click Here 

     

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here




WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page