10వ తరగతి పాసైన మహిళలకు :  Anganwadi Jobs 2022 ఏపీలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  Latest Job In Telugu

10వ తరగతి పాసైన మహిళలకు :  Anganwadi Jobs 2022 ఏపీలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  Latest Job In Telugu

Anganwadi Teacher Jobs Recruitment 2022 :

అంగన్‌వాడీ టీచర్ మరియు మినీ టీచర్, ఆయా  ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి

కర్నూలు జిల్లా లో సి.బెళగల్ : మండలంలో ఖాళీగా ఉన్న ఒక అంగన్వాడీ, ఆయా పోస్టుకు అర్హులైన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ రాము డు శనివారం ఓ ప్రకటనలో కోరారు. మండల పరిధిలోని ఇనగండ్ల – 1 అంగన్వాడీ కేంద్రం లో ఓసీ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు 10 లేదా 7 వ తరగతి ఉత్తీర్ణులై ఉం డాలని, 01 జులై 2022 నాటికి 35 సంవత్స రాల లోపు వయసుండి వివాహాతులై, స్థానికం గా నివాసముండే వారు అర్హులని పేర్కొ న్నారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను కోడుమూరు సీడీపీఓ కార్యా లయంలో ఈ నెల 12 వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తు అందజేయాలన్నారు.

అనంతపురం జిల్లాలో ఓడీ చెరువు : మండలంలో ఖాళీగా ఉన్న మినీ అంగన్ వాడీ, హెల్పర్ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ జయమ్మ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజే శారు. మినీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మల్లెంవాండ్లపల్లి, వీరప్పగారిపల్లి, నాయనాకోటతం డా -2, హెల్పర్ పోస్టులకు లింగాలవారిపల్లి గాజు కుంటపల్లి ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అన్ని పోస్టులు ఓసీ కేటగిరికి కేటాయించినట్లు చెప్పారు.  కనీసం పదవ తరగతి పాస్ అయి స్థానికంగా నివాసం ఉండాలని, 01-07-2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఈనెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ధర్మవరం అర్బన్ : ధర్మవరం నియోజకవర్గంలో మినీ అంగన్వాడీ, అంగన్వాడీ హెల్ఫర్ పోస్టు లకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ లక్ష్మి శనివారం తెలిపారు. మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టు పట్రపల్లి (హెచ్చ్), హెల్సర్ పోస్టులకు సంబంధించి రామాపురం -2 (బీసీ – బి), మద్దలచెరువు (ఓసీ), ఆత్మకూ రు (ఓసీ), ఆకుతోటపల్లి (ఎస్టీ), అప్రాచ్ రువు- 19 (బీసీ – ఎ), పత్యాపురం (బీసీ – డి), దాడితోట -4 (బీసీ – డి), తుమ్మల  (ఓసీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

AP Anganwadi Recruitment 2022 Vacancy Details :

ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి దానికి కావాల్సిన నోటిఫికేషన్ లో ఉంది చూడండి.

Anganwadi Notification 2022 Eligibility Criteria :

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు   

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/09/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

Anganwadi Jobs 2022 Apply Process :

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 08 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 14 సెప్టెంబర్, 2022.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️మిగిలిన జిల్లాలు  Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here 

➡️అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో👇👇 

➡️Telangana Anganwadi teacher Notification & Application Pdf👇👇👇 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *