SCCL Recruitment 2022 Junior Assistant jobs vacancy | in Telugu
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ ప్రజా సంబంధాల విభాగం, సింగరేణి భవన్, హైదరాబాద్ సింగరేణిలో 177 ఎక్స్ టర్నల్ క్లర్కు పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెల 20 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) శ్రీ ఎన్.బలరామ్ వెల్లడి సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 (క్లర్కు) పోస్టుల భర్తీకోసం గురువారం (జూన్ 16 వ తేదీ) నాడు యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో గల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సి అండ్ ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎన్. బలరామ్ సారథ్యంలో ఖాళీలను గుర్తించి ఎక్స్ టర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఇంటర్నల్ అభ్యర్థుల కోసం కూడా ప్రకటించిన పోస్టులకు ఇవి అదనం. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లో Careers విభాగంలో పొందుపరిచారు. కనీస బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్/ ఐ.టి. ఒక సబ్జెక్టుగా ఉన్న వారు లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు విధిగా పాసై ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు, ఎస్.సి, ఎస్.టి., బి.సి. లకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పై ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ అభ్యర్థులకు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడు కోటాకింద ఓపెన్ టు ఆల్ (అందరికీ అవకాశంగా) తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి ) శ్రీ ఎన్ . బలరామ్ తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20 వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారన్నారు. అలాగే దరఖాస్తుల స్వీకరణకు జులై 10 తేదీని తుది గడువుగా నిర్ణయించామన్నారు. ఇంకా ఇతర వివరాలు సింగరేణి వెబ్ సైట్లో పొందుపరిచామని, వెబ్ సైట్ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు .
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here