Department of Women Development and Child Welfare vacancy  One Stop Center (Sakhi) job requirement in Telugu 

Department of Women Development and Child Welfare vacancy  One Stop Center (Sakhi) job requirement in Telugu 

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిశ సఖి వన్ స్టాప్ సెంటర్ (సఖి) లో ఉద్యోగాలకు (కాంట్రాక్టు) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాచారానికి గురి అయిన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ (సఖి) లో ఉద్యోగాలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంది అని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 18.05.2022 నుండి 26.05.2022 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు దరఖాస్తులు సమర్పించవలెను.

విద్యార్హతలు :

1. పారా మెడికల్ పర్సనల్ : – పారా మెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్ గా  బి.యస్సీ నర్సింగ్ /జి.యన్.యం. కలిగి/ ఉండవలెను . మరియు ఆరోగ్యం నేపథ్యంలో పారామెడికో వృత్తిపరమైన డిగ్రీని కలిగి మరియు జిల్లాలో మహిళలపై పాపట్లపై ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్ట్/ కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో పనిచేసిన మహిళ

2. కేస్ వర్కర్ : – లా డిగ్రీ / మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ / M.A సోషియాలజీ / సైకాలజీ కలిగి, మరియు మహిళల పట్ల జరుగుతున్న హింస పై కౌన్సిలింగు చేయుటలో మహిళా అభ్యర్థిని లా డిగ్రీ / సోషల్ వర్కు మాస్టర్ డిగ్రీ కలిగి, ప్రభుత్వం లేదా నాన్ – గవర్నమెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం 3 సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి .. అభ్యర్థులు అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రెండవ అంతస్తు, వెలుగు ఆఫీస్ ఎదురుగ వున్నా ఐ.సి.పి.ఎస్ కార్యాలయము, కర్నూలు కలెక్టరేట్) వారి కార్యాలయములో ధరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను .. అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తుకు జతపరచవలెను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను.

జతపరచవలసిన ధ్రువపత్రములు :

1. విద్యార్హత

2. కులము

3. పుట్టిన తేది

4. నివాస ధ్రువపత్రము

5. పాస్ పోర్టు ఫోటోలు, దరఖాస్తు వెంట ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరిచి, కార్యాలయపు పనిదినములలో అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కర్నూల తేది : 26.10.2022 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️1st Notification PDF Click Here  

➡️2nd Notification Pdf Click Here

➡️3rd Notification Pdf Click Here

➡️ latest news paper cutting click here

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page